Tirumula: చిన్నారిని చంపేసిన చిరుత.. తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం!
Tirumala : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక లక్షిత మృతి చెందింది. ముందుగా లక్షిత తప్పిపోయిందని అంతా భావించగా.. పోలీసుల సేర్చ్ ఆపరేషన్లో లక్షిత మృతదేహం నరసింహ స్వామి ఆలయం వద్ద కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇక గత జూన్ 23న కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. ఇలా వరుస పెట్టి చిరుతలు దాడి చేస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.