తిరుపతిలో మరోసారి చిరుత అటాక్.. || Leopard Attack In Tirupati || Tirumala || RTV
తిరుమల బోనులో మరో చిరుత చిక్కింది. నరశింహస్వామి ఆలయం, 7వ మైలు మధ్య ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేశారు అటవిశాఖ అధికారులు. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించింది అటవీశాఖ. చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి బంధించారు. ఇక నడకమార్గం, ఘట్ రోడ్డులలో ఆపరేషన్ కొనసాగుతోంది.
Tirumala : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక లక్షిత మృతి చెందింది. ముందుగా లక్షిత తప్పిపోయిందని అంతా భావించగా.. పోలీసుల సేర్చ్ ఆపరేషన్లో లక్షిత మృతదేహం నరసింహ స్వామి ఆలయం వద్ద కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇక గత జూన్ 23న కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. ఇలా వరుస పెట్టి చిరుతలు దాడి చేస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.