Chiranjevi: గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమనుంచి ఇంకా ఎలాంటి స్పందనలేదన్న తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు చిరంజీవి స్పందించారు. ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు ఈ అవార్డులు అందిస్తామని ప్రకటించారు. కావున తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ ఎక్స్ వేదికగా చిరంజీవి పోస్ట్ పెట్టారు.
పూర్తిగా చదవండి..Gaddar Awards: ‘గద్దర్ అవార్డ్స్’.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. ఏమన్నారంటే!
తెలంగాణ సీఎం రేవంత్ ప్రస్తావించిన 'గద్దర్ అవార్డ్స్' అంశంపై నటుడు చిరంజీవి స్పందించారు. ప్రజా కళాకారుడి పేరిట సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు అందిస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీనిని తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు.
Translate this News: