Padma Vibhushan: పద్మ విభూషణ్ పురష్కారం అందుకున్న చిరంజీవి!

టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి పద్మ విభూషణ్ పురష్కారం అందుకున్నారు. గురువారం రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగగా.. కళా రంగానికి చేసిన సేవలకుగానూ చిరంజీవికి ఈ పురష్కారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు మెగాస్టార్.

Padma Vibhushan: పద్మ విభూషణ్ పురష్కారం అందుకున్న చిరంజీవి!
New Update

Padma Vibhushan: టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి పద్మ విభూషణ్ పురష్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగగా.. కళా రంగానికి చేసిన సేవలకుగానూ చిరంజీవికి ఈ పురష్కారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు మెగాస్టార్.

గణతంత్ర దినోత్సవం 2024 సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ విభూషణ్ అందించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Bhopal: మైనర్ కొడుకుతో ఓటు వేయించిన బీజేపీ నేత.. స్వయంగా వీడియో తీసి పోస్ట్!

ఇక గతంలో కేంద్ర ప్రభుత్వం చిరును పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్‌ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. అలాగే సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీ, హోర్ముస్జీ ఎన్‌.కామాలకు పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ఈ ఏడాది మొత్తం 132 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా.. వీటిలో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీ పురస్కారాలున్నాయి.

#chiranjeevi #padma-vibhushan-award
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe