Vishwambhara: స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన అభిమానులకు మరోసారి పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ప్రస్తుతం చిరు 156వ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతో మేకర్స్ ఫ్యాన్స్ ను అలరించగా.. తాజాగా మరో సాలిడ్ వీడియోను పోస్ట్ చేశాడు చిరు.
జిమ్‌లో కసరత్తులు..
ఈ మేరకు ‘విశ్వంభర’ మూవీకోసం తెగ కష్టపడుతున్నట్లు తెలిపాడు. యువకులతో పోటీపడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియాను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యాష్ కలర్ టీషర్టు, స్పోర్ట్ ట్రాక్ లో వ్యాయామశాలకు ఎంట్రీ ఇచ్చిన ఆయన వృద్దాప్య వయసులోనూ వర్కౌట్స్ ఇరగదీశారు. వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ తదితర కసరత్తులు చేస్తూ బలిష్టంగా మారుతున్న మజిల్స్ చూపిస్తూ అభిమానులను అలరించాడు.
ఇది కూడా చదవండి : Interim Budget: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్!
మల్టీస్టారర్ గా..
ఇక సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శింబును (Hero Simbu) ఈ చిత్రం కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 'విశ్వంభర' మల్టీస్టారర్ గా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ వీడియో వైరల్ అవుతుండగా 'వయసు అనేది ఒక నంబర్ మాత్రమే. మా బాస్ మనసు మా బాస్ కుర్రతనం మాత్రం ఎప్పుడూ అప్పటిలాగే ఉంటుంది. రియల్లీ ఇన్‌స్పైరింగ్. లవ్ యు చిరు' అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.