Chiranjeevi: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఆరోగ్యంపై టాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని బాధ పడినట్లు తెలిపారు. ఆయన సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి తోపాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
నటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి సైతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాయపడటం బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానట్లు తెలిపారు.
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానట్లు తెలిపారు.
కేసీఆర్కు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డాక్టర్లు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ను చేస్తున్నారు. కేసీఆర్ గురువారం అర్ధరాత్రి బాత్ కాలు జారి.. కిందపడటంతో కాలికి గాయమైంది. ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం వైద్యులు...కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సందేశాలు పంపిస్తున్నారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్య స్థితిపై చంద్రబాబు, పవన్ ఏం అన్నారంటే?