Bhola Shankar Collections: భోళాశంకర్ మొదటి రోజు రికవరీ ఎంత..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా. తమన్న, కీర్తిసురేష్, సుశాంత్ లాంటి స్టార్ నటీనటులు ఉన్న సినిమా. ప్రమోషన్ కూడా గ్రాండ్‌గా చేశారు. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

New Update
OTT: ఈ వారంలో ఓటీటీలో సందడే సందడి.. అర్థమైందా రాజా

Bhola Shankar Collections: ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల షేర్ వసూలు చేసింది, ఇది థియేట్రికల్ బిజినెస్‌లో కేవలం 20 శాతం మాత్రమే. 80 కోట్ల రూపాయల టార్గెట్ బ్రేక్-ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ సినిమాకు ఇంకా 58 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.

మెహర్ రమేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. పాత కాలం కథ, స్క్రీన్‌ప్లేతో తీసిన ఈ సినిమా.. ఇప్పటి తరాన్ని ఆకట్టుకోదనే విషయాన్ని సమీక్షకులు తేల్చేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుందనేది అనుమానాస్పదంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం: 4.51 కోట్లు
సీడెడ్ : 2.02 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.84 కోట్లు
ఈస్ట్ : 1.32 కోట్లు
వెస్ట్ : 1.85 కోట్లు
గుంటూరు: 2.08 కోట్లు
కృష్ణా : 1.03 కోట్లు
నెల్లూరు : 73 లక్షలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు