Megastar: కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో చిరు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!

సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి తాను పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా బీజేపీ నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరగగా.. ఇరువురు అభిమానులను అలరించారు.

Megastar: కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో చిరు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!
New Update

Chiranjeevi Interview With Kishan Reddy : సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి తాను పద్మవిభూషణ్ అవార్డు (Padma Vibhushan Award) అందుకున్న సందర్భంగా బీజేపీ నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరగగా.. పద్మవిభూషణ్ కు సంబంధించిన పలు ప్రశ్నలకు కిషన్ రెడ్డి ఆసక్తికర సమాధానాలిచ్చారు.

అక్కినేని తర్వాత పద్మ విభూషన్ అందుకున్న నటుడు..
ఈ మేరకు మొదటగా చిరంజీవికి తెలుగు ప్రజలు, కేంద్రప్రభుత్వం, తన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. అక్కినేని తర్వాత పద్మ విభూషన్ అందుకోవడం నిజంగా తెలుగు సినిమా గర్వకారణమన్నారు. రజనీకాంత్, చిరంజీవి నైతిక విలువలు కలిగిన నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారని పొగిడారు. అందరినీ సమన్వయ పరుస్తూ ముందుకు తీసుకెళ్లే చిరుకు ఇలాంటి అవకాశం లభించడం సంతోషించాల్సి విషయమన్నారు. సినిమానుంచి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతోపాటు కొత్త ఒరవడిని తీసుకొచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందారని, చిరంజీవికి లభించిన స్పందన చూసి సంతోషమేసిందన్నారు.

ఇండస్ట్రీకి పెద్ద బిడ్డగా ఉండాలంటూ..
ఇక ఇండస్ట్రీలేకపోతే తాను లేనని, తనకు అందరి మద్ధతు లేనిదే తనకు ఇంత స్థాయి దక్కేది కాదన్నారు చిరు. ఇంటికి పెద్ద బిడ్డగా కుటుంబ బాధ్యతలు చూసుకోవాలనే తపనతో ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలపై వెంటనే స్పందించానుకుంటాను అన్నారు. ఒక అర్టిస్ట్ గా తాను రాజకీయాల్లోకి రావడం కష్టమైనప్పటికీ ప్రజలకు మంచి చేయాలనే తపనతో ముందడుగు వేశానన్నారు చిరంజీవి. అసెంబ్లీలోనూ కొత్తగా అడుగుపెట్టినపుడు రాజకీయ నాయకుల తీరు చూసి ఆందోళన చెందినట్లు తెలిపారు. అయితే సభనుంచి బయటకు వచ్చిన తర్వాత వారి సన్నిహిత్యం చూసి ఆశ్చర్యపోయానన్నారు. కేంద్రమంత్రిగా టూరిజం బాధ్యతలు చేపట్టినపుడు తనకు దక్కిన గౌరవం, సంతృప్తిని మాటల్లో చెప్పలేనన్నారు. రాజకీయంగా ఇంత చేయొచ్చా అని అనుభవపూర్వకంగా అర్థమైందన్నారు. తిరుపతిలో చేపట్టిన ఇనిస్టిట్యూట్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పారు. ఇండియాలో ఉన్న అన్ని కల్చర్స్ నేర్పించేందకు ఒక సంస్థను స్థాపించాలని పోరాడి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రేణుగుంటలో శంకుస్థాపన చేయబోతున్నామనే సమయానికి అనుకోకుండా రాష్ట్ర విభజన సమయంలో తాను కేంద్రమంత్రి పదివికి రాజీనామా చేయడంతో వాయిదాపడిందన్నారు.

కల్మషం లేని వ్యక్తి..
చిరంజీవి కలిగివున్న గొప్ప ఆలోచనలను తాను ముందుకు తీసుకెళ్తానని కిషన్ రెడ్డి అన్నారు. అలాగే చిరంజీవి కల్మషం లేని వ్యక్తి అని, ఎక్కడా ఎవరీని నొప్పించకుండా పల్లెత్తు మాట అనలేదని, రాజకీయంగానూ ఎవరి మనసు నొప్పించేవారు కాదంటూ పొగిడేశారు. ఇక తాను ఇప్పటికీ అలాగే ఉన్నానని, వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేసి మాట్లాడనన్నారు కిషన్ రెడ్డి. వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ తదితర ప్రముఖుల నుంచి తాను చాలా నేర్చుకున్నానన్నారు. 75 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. దురదృష్టవశాత్తు టార్గెట్ లేకపోవడంతోనే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోయామన్నారు. మరో 25 ఏళ్లలో ప్రతి రంగాన్ని ముందంజలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పక్కా ప్రణాళికలతోనే ముందుకెళ్తున్నారని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5 స్థానంలో నిలుస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: Bhainsa: కేటీఆర్‌పై దాడి.. టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరిన దుండగులు!

కశ్మీర్ అందాలను సినిమా ద్వారానే..
జీ 20 సమావేశంలోనూ ప్రధాని మోడీ గారు సినిమా ఫీల్డ్ గురించి ప్రస్తావిస్తూ.. కశ్మీర్ అందాలను సినిమా ద్వారానే మెజారిటీ ప్రజలు చూశారన్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ అందాలను చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రముఖులను పిలిపించి మీటింగ్ పెట్టారన్నారు. రామ్ చరణ్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం సంతోషంగా ఉందని, వీదేశీ మంత్రులు సైతం నాటు నాటు పాటకు స్టెప్పులేశారంటూ ఆనందం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. 2020-23 మధ్య దాదాపు 300 సినిమాలు కశ్మీర్ లో షూటింగ్ జరుపుకున్నట్లు తెలిపారు. దీంతో నరేంద్రమోడీతోపాటు ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న చొరవ కారణంగానే ప్రపంచవేదికలపై భారతీయ జెండా రెపరెపలాడుతోందన్నారు చిరంజీవి.

ఫ్రంట్ లైన్ హీరోగా..
కరోనా సమయంలోనూ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ హీరోగా నిలవడంతోపాటు కరోనా కంట్రోల్ రూమ్ కిషన్ రెడ్డి ఆద్వర్యంలో జరగడం గొప్ప విషయమన్నారు చిరు. దేశవ్యాప్తంగా కిషన్ రెడ్డిపై ప్రజలు ప్రశంసలు కురిపంచాయన్నారు. బీజేపీ ప్రభుత్వం, మోడీలాంటి నాయకుడు ఉండటం వల్ల దేశంలో ఎక్కడ కలహాలు, అల్లర్లు లేవన్నారు కిషన్ రెడ్డి. అందరం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని చిరంజీవి కోరారు. సినిమాతోపాటు సమాజానికి, దేశానికి చిరంజీవి మరింత సేవ చేయాల్సిన అవసరం ఉందని, నిండా నూరెళ్లు జీవించి మరెందరో సినీ అభిమానులను అలరించాలని కిషన్ రెడ్డి కోరారు. చివరగా ఈ ఎన్నికలు విజయవంతం కావాలని, కిషన్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. చివరగా కిషన్ రెడ్డికి ప్రత్యేక కానుకగా పెన్ను ఇచ్చారు పద్మవిభూషన్ చిరు.

#chiranjeevi #kishan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe