Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాదు వ్యక్తిత్వాల్లో సైతం ఆయన మహోన్నత శిఖరం. జీవితంలో కష్టపడి పైకొచ్చిన వారిని.. ఆయన తన ఇంటికి పిలిచి మరీ అభినందించడం చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. తన తోటి కళాకారులెవరైనా సినిమాలో చిన్న పాత్ర చేసి మెప్పించినా సరే .. చిరు అభినందించడం జరిగిందని చాలా మంది నటులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పగా విన్నాం.
ఇక తాజాగా మెగాస్టార్ మరో సారి తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ విభూషణ్ పురష్కారాలు వరించిన తరుణంలో.. పద్మశ్రీ గ్రహితలు (Padma Shri Winners) యక్షగాన కళాకరుడు గడ్డం సమయ్య (Gaddam Sammaiah), డాక్టర్. ఆనందచారి వేలును (Velu Anandachari) స్వయంగా ఇంటికి ఆహ్వానించి షాల్వా, పుష్ప గుచ్చాలతో మర్యాద పూర్వకంగా సత్కరించారు. పద్మ విభూషణ్ వరించినందున సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు తన ఇంటికి వచ్చి అభినందనలు చెబుతుంటే.. మెగాస్టార్ మాత్రం ఇలా పద్మశ్రీ గ్రహితలను ప్రత్యేకంగా సత్కరించడం ఎంతో ఉన్నతంగా కనిపించింది.
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్
జనగామ జిల్లా అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన తెలంగాణ యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా.. 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. సమ్మయ్య 1985 లో నిర్వహించిన 'కీచకవధ' ప్రదర్శనలో కీచకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్. ఆనందచారి వేలు 1994 లో తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభ పురస్కారం, 1995 సంవత్సరంలో గవర్నర్ చేతుల మీదుగా కళారత్న పురస్కారం అందుకున్నారు.
Also Read: Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్