Chiranjeevi Donates 5 Crore to Janasena: మెగాస్టార్ చిరంజీవి గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉందని గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే మెగా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మొత్తానికి పవన్ స్థాపించిన జనసేన 21 స్ధానాల్లో బరిలోకి దిగింది. అయితే ఏపీ ఎన్నికలకు (AP Elections 2024) ముందు అన్నయ్యను పవన్ కలిశారు.
కాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో ఉన్నారు. పోచంపల్లికి సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు. అయితే చిరంజీవిని కలిసేందుకు అక్కడికి వెళ్లారు పవన్ కల్యాణ్.
అన్నయ్యను కలిసిన తమ్ముడు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం జనసేన పార్టీకి చిరంజీవి రూ. 5కోట్లు విరాళంగా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. కాగా పార్టీకి వీలైనంత తక్కువగా పవన్ విరాళాలు స్వీకరిస్తున్నారు.
తన స్వార్జితం నుంచి ఈమధ్యే రూ. 10కోట్లు పార్టీ నిర్వహణ ఖర్చులను ఇచ్చారు. మెగా హీరోలు తమ శక్తి మేరకు జనసేనకు విరాళాలు ఇస్తూనే ఉన్నారు.
హీరో వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, మేనల్లుడు సాయి తేజ్ రూ. 10 లక్షలు, వైష్ణవ్ తేజ్, నిహారికా కొణిదెల చెరో 5 లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. అంతేకాదు 'ఆరెంజ్' రీ రిలీజ్ కలెక్షన్లు కూడా జనసేనకు విరాళంగా ఇచ్చారు.
ఇది కూడా చదవండి : అన్నదాతలకు అలర్ట్..ఈరోజే అకౌంట్లో 17వ విడత డబ్బులు జమ.!