Chiranjeevi : ఆ విషయంలో మాత్రం వరుణ్‌ మీద చాలా కోపంగా ఉంది : చిరంజీవి!

వరుణ్‌ మీద చాలా కోపంగా ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. విషయం ఏంటంటే వరుణ్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ముందుగా చిరంజీవికి చెప్పలేదంట.. దాంతో వరుణ్‌ మీద బాగా కోపంతో ఉన్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు.

New Update
Chiranjeevi : ఆ విషయంలో మాత్రం వరుణ్‌ మీద చాలా కోపంగా ఉంది : చిరంజీవి!

Chiranjeevi Serious On Varun Tej : మెగా స్టార్‌ చిరంజీవి(Mega Star Chiranjeevi)  ఫ్యామిలీ నుంచి ఆ తరంలోనే కాకుండా ఈ తరంలో కూడా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌(Ram Charan) , మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌(Varun Tej), సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej) , వైష్ణవ్‌ తేజ్‌ వంటి వారు ఉన్నారు. వీరిలో చిరంజీవితో వరుణ్‌ తేజ్‌ బాండింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎన్నో ఇంటర్వ్యూలలో వరుణ్‌ చిరంజీవి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. చిరంజీవి అనే మహా వృక్షం నుంచి వచ్చిన కొమ్మలమే మేమంతా అంటూ పెదనాన్న గురించి చెప్పుకొచ్చాడు. చాలా సందర్భాల్లో తండ్రి నాగబాబు(Naga Babu) కి చెప్పలేని విషయాలను కూడా చిరంజీవితో చెప్పి తండ్రిని ఒప్పించిన సందర్భాలున్నాయని వరుణ్‌ చాలా సార్లు తెలిపాడు.

అయితే ఓ విషయంలో మాత్రం వరుణ్‌ మీద చాలా కోపంగా ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వరుణ్‌ మీద మెగాస్టార్ కోపంగా ఉండటానికి గల కారణాలు ఏంటి అంటూ తెగ హైరానా పడిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే వరుణ్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ముందుగా చిరంజీవికి చెప్పలేదంట.. దాంతో వరుణ్‌ మీద బాగా కోపంతో ఉన్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు.

అసలు మ్యాటర్‌ ఏంటంటే... వరుణ్‌ తేజ్‌ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్‌(Operation Valentine) అనే ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ వేగం చేసింది చిత్ర బృందం.

ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌ కు స్పెషల్‌ గెస్ట్‌ గా చిరంజీవి కూడా వచ్చారు. ఈ సందర్భంలో యాంకర్‌ సుమ వరుణ్‌ లవ్‌ స్టోరీ గురించి చిరంజీవి కి చెప్పలేదు అంటూ ఓ విషయాన్ని బయటకు తీసుకుని వచ్చింది.

వరుణ్‌-లావణ్య(Lavanya Tripathi) ప్రేమ విషయాన్ని మెగా ప్రిన్స్ చిరంజీవితో ఎందుకు చెప్పలేదు అంటూ సుమ అడగగా.. దానికి చిరంజీవి.. అన్ని విషయాలు నాతో చెప్తాడు. కానీ ఈ ఒక్క విషయం మాత్రం నాతో చెప్పలేదు. అందుకే నాకు వరుణ్‌ అంటే చాలా కోపంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

దాంతో వెంటనే మైక్‌ అందుకున్న వరుణ్‌ గౌరవంతో కూడిన భయం వల్ల చెప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ లావణ్య గురించి మొదట చెప్పింది పెదనాన్నకే అంటూ వరుణ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

Also Read : బిళ్ల గన్నేరు ఆకులతో షుగర్‌ వ్యాధిని కంట్రోల్ చేయోచ్చు.. దీనిని ఎలా తీసుకోవాలంటే!

#operation-valentine #chiranjeevi #varun-tej #naga-babu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు