భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చైనా స్పందించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గెలిచిన ఎన్డీయే కూటమికి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అభినందనలు తెలియజేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ.. భారత్‌తో పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. బలమైన, స్థిరమైన సంబంధం ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు.. శాంతి, అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 2020లో లడాక్‌లో చైనా, భారత్ మధ్య జరిగిన ఘర్షణ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. సమస్యల పరిష్కారం కోసం దాదాపు 21 సార్లు చర్చలు జరిగాయి.
Also Read: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కేబినెట్ పదవులపై కీలక చర్చ!