China Financial Crisis : ఆర్థిక ఇబ్బందుల్లో చైనా.. న్యూ ఇయర్ వేళ ప్రెసిడెంట్ జిన్‌పింగ్ షాకింగ్ ప్రకటన! రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. By Bhavana 02 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Xi Jinping : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది చైనా(China) అనే చెప్పుకోవచచు. అయితే గత కొంతకాలంగా చైనా ఆర్థిక వ్యవస్థ(Economy) చాలా వెనుక పడిపోయిందని తెలుస్తుంది. కరోనా(Covid) తరువాత చైనా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడైంది. అయితే ఈ విషయం గురించి ఆ దేశాధ్యక్షుడు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా నోరు విప్పలేదు. అయితే తాజాగా ఈ విషయం గురించి జిన్‌పింగ్(Xi Jinping) పెదవి విప్పారు. చైనా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు వివరించారు. దేశంలో వాణిజ్య, వ్యాపారాలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఉన్న ఉద్యోగులకే సరిగా జీతాలు అందడం లేదు. నిరుద్యోగులు ఉపాధి వేటలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 2013 నుంచి ప్రతి ఏటా కొత్త సంవత్సరం నాడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం చేస్తారు. ఆయన మొట్టమొదటి సారి ఆయన ఆర్థిక సవాళ్ల గురించి ప్రసంగించడం ఇదే మొదటి సార్. కొన్ని సంస్థలు ఇప్పటికే దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. సరైన ఉద్యోగాలు లేక కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోనికి తీసుకుని వచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆయన ప్రసంగించిన తరువాత చైనా జాతీయ గణాంకాల సంస్థ ..నెలవారీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ నివేదికను వెల్లడించారు. కంపెనీ ఆర్థిక స్థితిగతులు ఆరు నెలల గరిష్టానికి పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. Also read: వాట్సాప్ వాడే వారికి అలర్ట్.. 71 లక్షల ఖాతాలు క్లోజ్.. కారణమిదే! #china #xi-jinping #economy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి