అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ చైనా చేస్తున్న ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చైనా ఆరోపణలు భారత్ ఖండిస్తున్నప్పటికీ కూడా.. డ్రాగన్ తన వాదనలను ఆపడం లేదు. అయితే ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ధీటుగా సమాధానం ఇవ్వగా.. తాజాగా చైనా ఈ అంశంపై మళ్లీ స్పందించింది. అరుణాచల్‌ప్రదేశ్ భూభాగాన్ని భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని నోరు పారేసుకుంది.
Also Read: కంగనా రౌనత్ పోటీ చేయడంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
'ఇండియా - చైనా మధ్య సరిహద్దు వివాదం ఎప్పుడూ కూడా పరిష్కారం కాలేదు. గతంలో ఆ ప్రాంతం చైనాలో భాగంగా ఉండేది. అక్కడ చైనా పరిపాలన కూడా సాగేది. 1987లో భారత్ దాన్ని ఆక్రమించుకొని అరుణాచల్‌ప్రదేశ్‌గా రూపొందించుకుందని' చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. భారత్ చేసిన ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నామి.. ఈ విషయంలో తమ వైఖరిపై మార్పు లేదన్నారు.
ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఆ తర్వతా ఆ ప్రాంతం తమ భూభాగమేనని చెప్పడం ప్రారంభించింది చైనా. అయితే డ్రాగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గత నెలరోజుల్లో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మరోవైపు చైనా చేస్తున్న వాదనపై భారత్ కూడా గట్టిగా సమాధానమిస్తోంది. చైనా ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం కొత్త విషయం కాదని.. ఇప్పుడు వాటిని మరింతగా పెంచిందంటూ ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఆయన ఇలా వ్యాఖ్యానించిన తర్వాతే చైనా ఇలా మరోసారి నోరు పారేసుకుంది.