Watch Video : భార్యను కొట్టి చంపిన ఆర్థిక మంత్రి.. వీడియో వైరల్

కజకిస్థాన్‌లోని ఆర్థికశాఖ మంత్రి.. తన భార్య(31) కొట్టి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడు తన భార్యను కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Watch Video : భార్యను కొట్టి చంపిన ఆర్థిక మంత్రి.. వీడియో వైరల్

Financial Minister : భార్యభర్తల మధ్య గొడవలు(Wife & Husband Fight) రావడం సహజమే. కొన్ని జంటల్లో అయితే హత్యలు(Murder) జరిగిన సంఘటలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కజకిస్థాన్‌లోని ఓ సీనియర్ మంత్రి.. తన భార్య(31) కొట్టి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అతడు తన భార్యను కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది నవంబర్‌లో కజకిస్థాన్ ఆర్థికశాఖ మంత్రి 'కుయాండిక్ బిషింబాయేవ్' భార్య.. 'సాల్టానాట్ నుకెనోవా'(31) ఓ రెస్టారెంట్‌లో శవమై కనిపించింది. ఆ రెస్టారెంట్‌ కూడా మంత్రి వాళ్ల బంధువులదే.

Also Read: ప్రధాని మోదీ ద్వారక పూజపై రాహల్‌ సంచలన కామెంట్స్‌..

భార్యపై చిత్రహింసలు

అయితే ఆరోజంతా వీళ్లద్దరూ ఆ రెస్టారెంట్‌లోనే కలిసి ఉన్నారు. ఆ తర్వాత సాల్టానాట్ నుకెనోవా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో జరిగింది. దీనికి సంబంధించిన 8 గంటల సీసీటీవీ ఫుటేజ్‌ వీడియోను కోర్టులో ప్లే చేశారు. ఈ వీడియోలో మంత్రి కుయాండిక్.. తన భార్యను పదేపదే కొట్టడం, కాళ్లతో తన్నడం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆమె జుట్టు పట్టుకుని వేరే గదికి లాక్కేళ్లాడు. ఆ గదిలో ఎలాంటి కెమెరాలు లేవు. నుకెనోవా తన భర్త నుంచి తప్పించుకునేందుకు టాయిలోట్‌లోకి వెళ్లి దాక్కున్నా కూడా.. కుయాండిక్ ఆ బాత్రూం డోర్‌ను పగలగొట్టి ఆమెను బయటికి లాక్కొచ్చి కొడుతూనే ఉన్నాడని.. ఈ సమయంలోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు ప్రాసెక్యూటర్‌ కోర్టుకు తెలిపారు. ఇది కూడా ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది.

భర్తకు 20 ఏళ్ల జైలు శిక్ష

ఈ ఘటన జరిగాక దాదాపు 12 గంటల తర్వాత అంబులెన్స్ వచ్చింది. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ప్రకటించారు. నుకెనోవా మెదడుకు గాయం అవ్వడంతోనే ఆమె మృతి చెందినట్లు ఓ నివేదిక వెల్లడించింది. భార్యను చిత్రహింసలు పెట్టి చంపినందుకు కుయాండిక్ బిషింబాయేవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇందులో తన తప్పేమి లేదని.. తన భార్యనే ఒంటికి గాయాలు చేసుకొని మరణించిందని అతడు కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఈ కేసుపై ఇటీవల నిర్వహించిన విచారణ సోషల్ మీడియాలో ప్రత్యక్షప్రసారం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో బయటపడటంతో.. ప్రస్తుతం కజకిస్థాన్‌లో లింగ సమానత్వం, గృహం హింసలపై చర్చలు నడుస్తున్నాయి.

గతంలోనే అరెస్టు 

ఇదిలాఉండగా.. కుయాండిక్ బిషింబాయేవ్‌ 2017లోనే ఓ లంచం కేసులో అరెస్టయ్యారు. కోర్టు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అయినప్పటికీ మూడేళ్ల లోపలే అతడు బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పుడు భార్యను చంపిన కేసులో కూడా అతడు దోషిగా తేలినప్పటికీ.. గతంలో లాగే ఏదో విధంగా ఈ జైలు శిక్ష నుంచి తప్పించుకుంటారని కజకిస్థాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: సెల్‌ఫోన్‌ను మింగిన ఖైదీ.. చివరికి

Advertisment
Advertisment
తాజా కథనాలు