Kids Junk Food : మీ పిల్లలు జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా?..ఇలా మానిపించండి

జంక్ ఫుడ్స్ ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే ప్రమాదకరం. పిల్లల రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం వలన ఊబకాయం, క్యాన్సర్‌, గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వస్తాయి. పిల్లలు జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాల్సిందే!

New Update
Kids Junk Food : మీ పిల్లలు జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా?..ఇలా మానిపించండి

Junk Food : ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు(Parents) తమ పిల్లల విషయంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి జంక్ ఫుడ్(Junk Food) తినడం ఒకటి. జంక్ ఫుడ్స్ ఎంత రుచికరంగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే ప్రమాదకరం. పిల్లల రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా జంక్ ఫుడ్స్ తింటుంటారు. దీని వల్ల ఊబకాయం, క్యాన్సర్ల బారిన పడుతుంటారు. జంక్స్‌ ఫుడ్స్‌ వల్ల గుండె జబ్బులు(Heart Diseases), మధుమేహం(Diabetes), రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వస్తాయని వైద్యులు అంటున్నారు. జంక్ ఫుడ్స్ చాలా తక్కువ ఫైబర్, ఎక్కువగా చక్కెర, ఉప్పును కలిగి ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తిపైనా ప్రభావం పడుతుంది.

ప్రవర్తనలో మార్పులు:

  • జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పిల్లల ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆహార పదార్థాలను(Food Items) ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ, దూకుడు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

జంక్ ఫుడ్ అలవాటును ఎలా తగ్గించాలి?

  • పిల్లలకు ఆహార పదార్థాలపై అవగాహనపెంచాలని నిపుణులు చెబుతున్నారు. పోషకాల గురించి చెప్పడం, రకరకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇంట్లోనే వండి తినిపించడం వల్ల కూడా జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉంచవచ్చని చెబుతున్నారు.

కిరాణా సామాగ్రి నుంచి స్నాక్స్‌ను తొలగించాలి:

  • కిరాణాసామాన్లతో పాటు జంక్‌ ఫుడ్స్‌ తేకూడదని అంటున్నారు. పిల్లలకు జంక్‌ ఫుడ్‌ కనిపించకపోతే తినాలని కూడా వాళ్లకు అనిపించదని, ఏదైనా అడిగితే ఇంట్లోనే చేసి పెట్టడం ఉత్తమం అని, ఇలా చేయడం వల్ల పిల్లలను వ్యసనాల నుంచి దూరం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆకర్షణీయమైన పౌష్టికాహారం:

  • సాధారణంగా ఇంట్లో చేసే ఆహార పదార్థాలు పిల్లల(Children's) దృష్టిని ఆకట్టుకోలేవు. దాని కోసం మీరు చేసే ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని నిపుణులు అంటున్నారు. తయారు చేసే పద్ధతి, డిజైన్లలో కూరగాయలను కట్‌ చేసి పెట్టడం వల్ల పిల్లలు చూసేందుకు, తినేందుకు కూడా ఇష్టపడతారని సలహా ఇస్తున్నారు.

స్క్రీన్ సమయాన్ని తగ్గించండి:

  • పిల్లలు టీవీ లేదా మొబైల్‌ చూస్తూ ఎక్కువ జంక్‌ ఫుడ్స్‌ తింటుంటారు. అందుకే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం ద్వారా జంక్‌ ఫుడ్స్‌ తినడం ఆపవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: బీట్‌రూట్‌ తినడం ఇష్టం లేదా?..ఇలా ఇడ్లీగా మార్చేయండి

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు