Meal Tips: పిల్లలు మంచంపై కూర్చుని అన్నం తింటున్నారా..ఈ విషయాలు గుర్తుంచుకోండి పిల్లలు ఆహారాన్ని మంచం మీద కూర్చొని తింటే అధిక బరువు, చర్మ అలెర్జీ, జీర్ణక్రియ సమస్యలతోపాటు ఆహార పైపులో ఆహారం ఇరుక్కుపోతుంది. కుర్చీ, నేలపై కూర్చొని ఆహారం తింటే కడుపు కండరాలు సక్రమంగా పనిచేసి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. By Vijaya Nimma 04 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Meal Tips: చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు. అయితే ఈ ఆలవాటు మంచిది కాదంటున్నారు. గ్రంథాల ప్రకారం.. ఇది ఆహారం పట్ల అగౌరవాన్ని కలిగిస్తుంది. పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఎప్పుడూ ఆహారం తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మంచం మీద కూర్చోని భోజనం తినే పిల్లలను ఎక్కవగా ఉంటారు. టీవీ చూస్తున్నప్పుడు వీపు లేదా పొట్టపై పడుకుని చిరుతిళ్లు తినేవాళ్లు ఉన్నారు. అలా తింటే పిల్లలు ఎక్కువ ఫుడ్స్‌ను తింటారు. ఇలా తినేపెద్దలు, పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు అంటున్నారు. భోజనం సరిగ్గా కూర్చొని తీసుకోకపోతే భంగిమ చెడుగా మారి స్థూలకాయంతోపాటు కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మంచం మీద పడుకుని ఆహారం తింటే కలిగే నష్టాల గురించి కొన్ని విషాయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియ బలహీనం: పిల్లలకు పడుకుని తినే అలవాటు ఉంటే జీర్ణక్రియ సరిగా ఉండదు. వెనుకభాగంలో పడుకుని ఆహారం తింటే ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియ కష్టమవుతుంది. దీని వలన కడుపు నొప్పి, గ్యాస్‌తోపాటు అసౌకర్యంగా ఉంటుంది. ఆహారం ఇరుక్కుపోతుంది: ఆహారం తినే భంగిమ సరిగ్గా లేకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి.ఈ భంగిమలో ఫుడ్ తినడం మంచిది కాదు. ఇలానే తింటే అనేక ఇబ్బందులతో పాటు ఆహార పైపులో ఆహారం ఇరుక్కుపోతుంది. అధిక బరువు : మంచం మీద పడుకుని ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. మీ బరువును కాపాడుకోవాలనుకుంటే, కుర్చీ లేదా నేలపై కూర్చొని ఆహారం తినడం అలవాటు చేసుకుంటే కడుపు కండరాలు సక్రమంగా పనిచేసి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. నిద్రపై చెడు ప్రభావం: మంచం మీద భోజనం చేయడం వల్ల ఆహారం బెడ్షీట్లకు అంటుకుంటుంది. దానిని శుభ్రం చేయలేకపోతే సూక్ష్మక్రిములతో పాటు వాసన వస్తుంది. దీనివల్ల నిద్రకు ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల..మంచం మీద తినకుండా ఉంటే మంచిది. చర్మ అలెర్జీ సమస్యలు: మంచం మీద పడుకుని ఆహారం తింటే చర్మానికి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మంచం మురికిగా ఉంటుంది. ఏదైనా పడిపోతే, చిన్న కీటకాలు దానిపైకి వస్తాయి. ఒకే బెడ్‌పై పడుకుంటే..చర్మానికి అలెర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: గుమ్మడికాయను ఇలా వండుకుని తింటే మధుమేహం పరార్ #meal-tips #digestive #bed #eating-rice #health-tips #children మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి