Child Care Tips: మీ పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా? దీనికి కారణమిదేనట..!

మీ పిల్లలకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా? పిల్లలు అలా మాట్లాడటం చూసి మీరు భయపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. మీ పిల్లలు నిద్రలో మాట్లాడితే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు. పిల్లలు నిద్రలో మాట్లాడటానికి గల ఖచ్చితమైన కారణం ఏంటో పూర్తిగా తెలియనప్పటికీ.. ఇది ప్రమాదకరం ఏమీ కాదని చెబుతున్నారు.

Child Care Tips: మీ పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా? దీనికి కారణమిదేనట..!
New Update

Kids Talk in Their Sleep: మీ పిల్లలకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా? పిల్లలు(Kids) అలా మాట్లాడటం చూసి మీరు భయపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. మీ పిల్లలు నిద్రలో మాట్లాడితే(Kids Talk in Sleeping) భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు. పిల్లలు నిద్రలో మాట్లాడటానికి గల ఖచ్చితమైన కారణం ఏంటో పూర్తిగా తెలియనప్పటికీ.. ఇది ప్రమాదకరం ఏమీ కాదని చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని సోమ్నిలోక్వి అని కూడా పిలుస్తారట. ఇది సర్వసాధారణం అని చెబుతున్నారు. పిల్లల్లో ఈ రకమైన సమస్యలు ఒత్తిడి, జ్వరం, నిద్రలేమి, క్రమరహిత నిద్ర వంటి కారణాల వల్ల జరుగుతుందట. పిల్లలకు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉండవచ్చు అని చెబుతున్నారు వైద్యులు. అలర్జీలు, అడినాయిడ్స్, టర్బునేట్స్, హైపర్ట్రోఫీ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయంటున్నారు.

ముక్కు ద్వారా శ్వాస తీసుకోకపోవడానికి, నిద్రలో మాట్లాడటానికి ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతున్నారు వైద్యులు. అయితే, ఈ అంశంపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నోస్ సెప్టమ్ అనేది ఎముక, మృదులాస్థికి సంబంధించిన సన్నని గోడ. ఇది నాసికా కుహరాన్ని రెండు వేర్వేరు మార్గాలుగా విభజిస్తుంది. కొంతమంది పిల్లలలో, ఈ సెప్టమ్ దాని సాధారణ స్థానం నుండి పక్కకు జరుగొచ్చు. ఫలితంగా ఒక నాసికా మార్గం మరొకదాని కంటే ఇరుకైనదిగా మారుతుంది. ఈ పరిస్థితి పిల్లలు పుట్టినప్పుడు ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

నిద్రలో మాట్లాడటానికి కారణం ఏంటి?

పిల్లలు నిద్రలో మాట్లాడటం అనేది ఒక సాధారణ దృగ్విషయంగా పేర్కొంటున్నారు వైద్యులు. నాసల్ సెప్టమ్ (DNS) దీనిలో ముక్కు నిర్మాణం సరిగా లేకపోవడం, పిల్లల నిద్ర విధానాలు సరిగా లేకపోవడం ఇది జరుగుతుందని చెబుతున్నారు. సెప్టమ్ సరిగా లేకపోవడం వలన వాయుమార్గం కుంచించుకుపోతుంది. తద్వారా పిల్లలు నిద్రపోతున్నప్పుడు.. శ్వాసను సరిగా తీసుకోలేకపోతారు. గురక, నోటి శ్వాస తీసుకోవడం, స్లీప్ అప్నియాకు కారణం అవుతుంది. శ్వాసలో సమస్యలు, పదే పదే నిద్ర లేవడం జరుగుతుంది. సెప్టమ్ విచలనం కారణంగా పిల్లల నిద్రకు భంగం కలుగుతున్నట్లయితే.. తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్, శాస్త్రచికిత్స వంటికి చేయించాల్సి ఉంటుంది. అయితే, సెప్టమ్ విచలనం పిల్లల నిద్ర, మొత్తం ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుంది.

కొందరు వైద్యులు మరో కారణం కూడా చెబుతున్నారు. పిల్లలు నిద్రలో మాట్లాడటం అనేది నిద్రలో మెదడు కార్యకలాపాలను ప్రతిబింబించే ఒక సాధారణ, ఆసక్తికరమైన దృగ్విషయంగా పేర్కొంటున్నారు. ఇది వారి అంతరంగిక ఆలోచనలు, భావాలను బహిర్గతం చేసినప్పటికీ.. దీని గురించి భయపడాల్సిన పనిలేదు అని చెబుతున్నారు వైద్యులు. అయితే, సెప్టమ్ విచలన సమస్య ఉంటే మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించాల్సి ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీ ధృవీకరించడం లేదు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలున్నా.. సందేహాలున్నా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Also Read:

ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..

కాంగ్రెస్‌ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!

#child-care-tips #child-health #kids-health #kids-health-news #kids-caring #kids-sleeping-tips #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe