Chicken Price: చికెన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన ధరలు!

ఏపీ , తెలంగాణలో కేజీ చికెన్‌ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్‌ కేజీ ధర స్కిన్‌ లెస్‌ రూ. 200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం క్రితం ఇదే కేజీ చికెన్‌ ధర రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్‌ ఉన్న చికెన్ అయితే రూ. 200 లోపే వస్తుంది.

Chicken Price: చికెన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన ధరలు!
New Update

ఆదివారం వచ్చిందంటే చాలు... నాన్ వెజ్‌ ప్రియులు తెగ సంబరపడిపోతుంటారు. ఎప్పుడెప్పుడూ చికెన్‌ తిందామా అని ఎదురు చూస్తుంటారు. గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో చికెన్‌ తినాలనుకునే వారి నోట్లో నీరు పోసినట్లే అయ్యింది.

అలాంటి వారికి ఇప్పుడు ఓ శుభవార్త.. ఏపీ , తెలంగాణలో కేజీ చికెన్‌ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్‌ కేజీ ధర స్కిన్‌ లెస్‌ రూ. 200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం క్రితం ఇదే కేజీ చికెన్‌ ధర రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్‌ ఉన్న చికెన్ అయితే రూ. 200 లోపే వస్తుంది.

గత కొద్ది రోజుల నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా కోళ్లు విరివిగా లభిస్తుండడంతో ధరలు దిగి వచ్చాయి. దీంతో ఆదివారం కావడంతో చికెన్‌ షాపుల మీద నాన్ వెజ్‌ ప్రియులు క్యూ కడుతున్నారు. మరి ఇకెందుకు ఆలస్యం మీరు కూడా చికెన్‌ ప్రియులైతే వెంటనే చికెన్‌ తెచ్చేసుకోండి.

Also read: ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు..40 మంది..!

#prices #andhrapradesh #telangana #chicken
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe