Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ట్రిపుల్ సెంచరీ దాటిన కిలో చికెన్ ధర.!

హైదరాబాద్ లో చికెన్ ధరలు ఎండలతో పోటీ పడుతున్నాయి. నాలుగైదు రోజుల వరకు కిలో చికెన్ ధర 125-150రూపాయలు ఉంటే..ఇఫ్పుడు ఏకంగా రూ. 300 చేరుకుంది. చికెన్ కొందామంటే జంకుతున్నారు నగరవాసులు.పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోనే చికెన్ ధరలు భారీ పెరిగాయంటున్నారు వ్యాపారులు.

New Update
Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ట్రిపుల్ సెంచరీ దాటిన కిలో చికెన్ ధర.!

Chicken Price:  ఎండాకాలం షురూ అయితే చికెన్, కోడిగుడ్డు ధరలు తగ్గుతుంటాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎండలతో పోటీ పడుతున్నాయి చికెన్ ధరలు. నాలుగైదు రోజుల క్రితం కిలో 150 రూపాయలు పలికిన చికెన్ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. కిలో రూ. 300లు దాటింది. సామాన్యులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ధర ఒక్కసారిగా పెరగడంతో కొనేందుకు జంకుతున్నారు. దీంతో వ్యాపారులు కిలో ధరను కాస్త తగ్గించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు స్కిన్ లెస్, చికెన్ కిలో ధర రూ. 180 నుంచి 200 వరకు ఉంది. లైవ్ కోడి ధర రూ. 120 నుంచి రూ. 160 వరకు ఉంది. అయితే పెరుగుతున్న ఎండలతోపాటుగా మేడారం జాతర నేపథ్యంలె కోళ్ల సరఫరా భారీగా పడిపోయింది.

దీంతో చికెన్ కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 280 నుంచి 300 వరకు పెరగడంతో జనం బెంబేలెత్తిపోయారు. కిలో లైవ్ కోడి ధర కూడా 180 వరకు చేరింది. పెరిగిన చికెన్ ధరలతో చికెన్ కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అయితే నాలుగైదు రోజులుగా అమ్మకాలతో పోల్చితే చికెన్ అమ్మకాలు 40శాతానికి పడిపోయాయి. హైదరాబాద్ లో ప్రతిరోజూ 12వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతుండేవి. గత ఆదివారం హోల్ సేల్ , రిటైల్ కలిపి కేవలం 6 టన్నుల విక్రయలు మాత్రమే జరిగాయి. ఎండాకాలం, శుభకార్యాలన్నీ ఒకేసారి రావడంతో చికెన్ కు డిమాండ్ తగ్గిన సరఫరా లేదని చెబుతున్నారు.

అయితే బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్ల సరఫరా తగ్గి చికెన్ ధరలపై ఎఫెక్ట్ పడిందని మరికొందరు వ్యాపారులు అంటున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడు బర్డ్ ఫ్లూ అంటూ భయపడిన జనం..ఇప్పుడు తిందామంటే కిలో 300అనగానే కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ కు తెలంగాణతోపాటు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో చికెన్ సరఫరా జరుగుతుంది.

ఇది కూడా చదవండి: మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా..జాబితాలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ తోపాటు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు