Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో స్పీకర్‌గా రమణ్‌ సింగ్.. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని సీఎంగా నియమించింది. అలాగే అరుణ్ సావో, విజయ్ శర్మలను డిప్యుటీ సీఎంలుగా ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మూడుసార్లు సీఎంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నియమించింది.

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో స్పీకర్‌గా రమణ్‌ సింగ్.. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు
New Update

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం బీజేపీ అధిష్ఠానం కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ని ప్రకటించింది. రాయ్‌పూర్‌లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయగా.. అందులో విష్ణు దేవ్‌ను సీఎంగా ఎంపిక చేశారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో 2003 నుంచి 2018 వరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నేత రమణ్‌ సింగ్‌ను పక్కన పెట్టి మరీ.. విష్ణుదేవ్‌కు సీఎంగా హైకమాండ్ బాధ్యతలు అప్పజెప్పింది. అలాగే ఇద్దరు డిప్యూటీ సీఎలను కూడా అధిష్ఠానం ఎంపిక చేసింది. అరుణ్ సావో, విజయ్ శర్మల పేర్లను ఖరారు చేసింది. అయితే మాజీ సీఎం రమణ్ సింగ్‌ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నియమించింది.

Also Read: మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్ ఘటన.. అసలు నిజం ఇదే..

ఇదిలాఉండగా.. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు బీజేపీ 54 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 35 స్థానాల కైవసం చేసుకుంది. బీజేపీ విజయం తర్వాత ముఖ్యమంత్రి ఎవరూ అనే దానిపై బీజేపీ పెద్దలు గత కొన్ని రోజులుగా మంతనాలు జరిపారు. ఎవరు సీఎం అవుతారా అని ఆ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూశారు. చివరికి ఆదివారం జరిగిన సమావేశంలో విష్ణుదేవ్‌ సాయ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో ఇందుకు హైకమాండ్‌ కూడా ఓకే చెప్పేసింది. గిరిజన వర్గానికి చెందిన విష్ణుదేవ్‌ సాయ్.. ఈ ఎన్నికల్లో గిరిజనుల నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు రాబట్టగలిగారు. దీంతో హైకమాండ్ కూడా చివరికి ఆయన వైపే మొగ్గు చూపింది.

Also Read: 54 మంది పోస్టులు ఊస్ట్.. రేవంత్ సంచలనం

#telugu-news #telangana-news #chattisgarh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe