ప్రశాంతంగా ముగిసిన ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ పోలింగ్!

ఈరోజు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 71.11 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో సాయంత్రం 5 వరకు 67.34 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Election Commission : పోలింగ్‌ సమయాన్ని పెంచిన ఎన్నికల కమిషన్‌..ఎక్కడ..ఎందుకంటే!
New Update

Chhattisgarh Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు గాను ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌లో తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 70 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 వరకు 67.34 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈనెల 7న ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో మిగిలిన 70 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మీరు వేసే ఒక్క ఓటు.. రాష్ట్రంలో రైతులు, యూత్‌, మహిళల భవిష్యత్ కు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఓటు వేయండి. ఛత్తీస్‌గఢ్‌ బంగారు భవిష్యత్ కోసం ఓటు వేయండి.' అని అన్నారు.

ALSO READ: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు..

Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్ లో 230 సీట్లకు ఒకేసారి పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 71.11 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్‌ కీలక నేత కమల్‌నాథ్‌ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్‌ గెలుస్తుంది. నాకు ప్రజల మీద నమ్మకముంది. బీజేపీ శివరాజ్‌సింగ్‌లా మేము ఇన్ని సీట్లలో గెలుస్తాము అని చెప్పను. ఎన్ని స్థానాల్లో గెలుపు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. రాష్ట్రంలో పోలీసులు, వ్యవస్థ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరికొన్ని గంటలు మాత్రమే వారు ఇలా చేయగలరు. తర్వాత అంతా మారిపోతుంది. వారు డబ్బులు, లిక్కర్‌ పంచుతున్నట్టు నిన్న నాకు కొన్ని కాల్స్‌, వీడియోలు వచ్చాయి.' అని అన్నారు

ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ను డిసెంబర్ 3న నిర్వహించనున్నారు.

ALSO READ: ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు..

#madyapradesh-elections #chhattisgarh-elections #polling-updates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe