Breaking: ధోనీ ఫ్యాన్స్ కు షాక్.. CSKకు కొత్త కెప్టెన్!

2024 IPL సీజన్ 17లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎస్ కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నట్లు తెలిపింది. ఈ సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నట్లు టీమ్ మెనేజ్ మెంట్ ప్రకటించింది.

New Update
Breaking: ధోనీ ఫ్యాన్స్ కు షాక్.. CSKకు కొత్త కెప్టెన్!

New Captain For Chennai Super Kings:  2024 IPL సీజన్ 17లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎస్ కే కెప్టెన్సీ నుంచి ధోనీ (MS Dhoni) తప్పుకున్నట్లు తెలిపింది. ఈ సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నాయకత్వం వహించనున్నట్లు టీమ్ మెనేజ్ మెంట్ ప్రకటించింది.

ఈ సీజన్‌ ఆరంభానికి కొద్దిరోజుల ముందు ధోని ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన పోస్టు అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. ‘న్యూ రోల్‌’ అంటూ ధోని క్యాప్సన్ పెట్టడంతో సీఎస్కే కెప్టెన్సీ గురించే అంటూ పెద్ద ఎత్తున్న చర్చ మొదలైంది. ‘న్యూ సీజన్‌లో న్యూ రోల్‌ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నా. స్టే ట్యూన్డ్‌’ అంటూ పోస్ట్‌ పెట్టగా నెట్టింట వైరల్‌ అయింది.

దీంతో ధోని ధోని కొత్త రోల్‌ అంటే ఓపెనర్‌గా వస్తాడని కొందరు.. కెప్టెన్సీని వదిలేస్తున్నాడని మరికొందరు వాదిస్తుండగా ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ధోని ఈ సీజన్‌లో మెంటార్‌గా ఉండబోతున్నాడంటూ కూడా వాదనలు వినిపించాయి.

మార్చి 22 నుంచి ఐపీఎల్ 17 లీగ్(IPL 17 League) షురూ కాబోతోంది. శుక్రవారం మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(Royal Challengers Bangalore) తలపడనున్నాయి.

Also Read: హైదరాబాద్ లో డేంజర్ మామిడి పండ్లు.. తింటే మటాషే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు