Mahanandi : మహానందిలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు

AP: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులను అలర్ట్ చేశారు అధికారులు.

Mahanandi : మహానందిలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
New Update

Mahanandi Cheetah : ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ (Mahanandi Temple) వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు ఆలయ అధికారులు. భక్తులు గుడి వెనుకవైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు. చిరుత సంచారంతో నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చిరుత (Cheetah) దాడులతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. అలర్ట్‌గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.

Also Read : కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

#mahanandi #kurnool-district #cheetah
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe