Beauty Tips: జిడ్డు చర్మానికి చెక్..ఇది వాడి చూడండి!

జిడ్డు చర్మం, మచ్చలు ఉంటే సాలిసిలిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. సాలిసిలిక్ యాసిడ్‌ని రాత్రిపూట ఉపయోగించడం ఉత్తమం. సాలిసిలిక్ యాసిడ్‌నివాడేనప్పుడు మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ వాడాలని చర్మ నిపుణులు చెబుతున్నారు.

Beauty Tips: జిడ్డు చర్మానికి చెక్..ఇది వాడి చూడండి!
New Update

Beauty Tips: ప్రస్తుత కాలంలో చర్మ సంరక్షణకు ఎన్నో క్రీములు అందుబాట్లో ఉన్నాయి. అయినా.. మొటిమలు, చర్మ సంరక్షణ సంబంధిత సమస్యలు వస్తూనే ఉన్నాయి. చర్మ సమస్య ఒక్కసారి మొదలైతే అది అంత తేలికగా నయం కాదు. దీనిని నయం చేసుకోవాటానికి ఎంతో సమయం తీసుకుంటుంది. కొంతమందికి చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి అనేక చర్మ సంరక్షణ మందులు ఉపయోగిస్తారు. చర్మం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా సాలిసిలిక్ యాసిడ్ గురించి తెలుసుకోవాల్సిందే. నేటికాలంలో ఇది చర్మ సంరక్షణ ఉపయోగించే ఓ రసాయనం. ఈ రసాయనం మొటిమలు, నల్ల మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. అయితే.. అది ఎవరికి అవసరం..? అందరూ ఉపయోగించగలా..? చర్మవ్యాధి నిపుణుడు ఎంటున్నారో..!! ఈ రసాయనాన్ని ఉపయోగించే పద్ధతి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జిడ్డుగల చర్మం పోవాలంటే:

  • జిడ్డు చర్మం మచ్చలకు ప్రధాన కారణం. ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. అందువల్ల..చర్మం జిడ్డుగా ఉన్నవారు తప్పనిసరిగా సాలిసిలిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. ఇది కణాల జిగటను తగ్గిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు దీనిని రోజూ వాడోచ్చు. ఇది అదనపు జిడ్డును తొలగించడానికి సహాయపడుతుంది.

బ్లాక్ హెడ్స్ పోతాయి:

  • సాలిసిలిక్ ఆమ్లం ఒక బీటా హైడ్రాక్సీ ఆమ్లం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. అందువల్ల డీప్ ఎక్స్‌ఫోలియేషన్‌కు ఇది మంచి పదార్ధం. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటే సాలిసిలిక్ యాసిడ్ వాడితే మంచిది.

ఏ సమయం బెస్ట్:

  • సాలిసిలిక్ యాసిడ్‌ని రాత్రిపూట ఉపయోగించడం ఉత్తమని చర్మ నిపుణులంటున్నారు. పగటిపూట ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉంటే చర్మం చాలా త్వరగా టాన్ అవుతుంది. అప్పుడు రాత్రిపూట ఈ రసాయనాన్ని ఉపయోగించడం మంచిది. ఉదయం కూడా సాలిసిలిక్ యాసిడ్ను ఉపయోగించవచ్చు.

వాడే విధానం:

  • కేవలం రెండు చుక్కల సాలిసిలిక్ యాసిడ్ చర్మ సమస్యలను తొలగిస్తుంది. సాలిసిలిక్ యాసిడ్‌ని రోజుకు రెండుసార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

నాణ్యమైన మాయిశ్చరైజర్‌:

  • సాలిసిలిక్ యాసిడ్‌ని వాడేనప్పుడు మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ వాడాలి.
  • కాంబినేషన్ స్కిన్, బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ఉన్న దగ్గర మాత్రమే సాలిసిలిక్ యాసిడ్‌ను అప్లై చేయాలి. మిగిలిన ముఖంపై మాయిశ్చరైజర్‌ను అప్లై చేయవచ్చు.
  • సాలిసిలిక్ యాసిడ్‌కు అలెర్జీని కలిగి ఉంటే..డాక్టర్లను సంప్రదించండి.
  • సాలిసిలిక్ యాసిడ్‌తో వాడేటప్పుడు కొన్ని మందులు ప్రతిస్పందిస్తాయి. అందుకని ప్రస్తుతం తీసుకుంటున్న మందుల గురించి డాక్టర్లకు చెప్పాలి.

ఇది కూడా చదవండి: ఇంట్లో గుడ్లగూబ ఫొటోలు ఉంటే అశుభమా? అసలు విషయాన్ని తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #beauty-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe