Cyber Crime: సైబర్ క్రైమ్ లో మోసపోతే ఇలా చేయండి..మీ డబ్బును తిరిగి దక్కించుకోండి! సైబర్ మోసాలు జరిగినప్పుడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించడం కష్టమని అంటుంటారు. కానీ ఇలా చేస్తే చాలు… మీ డబ్బులు వచ్చేస్తాయి. By Durga Rao 16 Apr 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Cyber Crime: రోజు రోజుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరుగుతోంది. మార్కెటింగ్, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్ లైన్ ద్వారా కొనసాగుతున్నాయి. లావాదేవీలు అన్నీ కూడా డిజిటల్ ప్లాట్ ఫాంపైనే జరుగుతున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు లభిస్తుండటంతో ప్రజలు నిత్యావసరాలు మొదలుకొని గృహోపకరణాల వరకు అన్నింటిని ఆన్ లైన్ మార్కెట్ లోనే కొనుగోలు చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. లావాదేవీలు కూడా డిజిటల్ ప్లాట్ ఫాంపైనే కొనసాగుతున్నాయి. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటు ఖాళీ చేస్తున్నారు. ఇలా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో పోలీసు శాఖ సైబర్ మోసాలను కట్టడి చేయడం కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు సైబర్ సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరి చొప్పున సైబర్ వారియర్స్ గా నియమించారు. ప్రత్యేకంగా ఈ సైబర్ వారియర్స్ ఒక్కొక్కరికి ఒక్కో సెల్ ఫోన్, సిమ్ కార్డ్ కూడా అందజేశారు. Also Read: SI వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..! సైబర్ క్రైం బాధితుల కోసం ప్రత్యేకంగా 1903 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. మోసపోయిన నిముషాల వ్యవధిలోనే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే వంద శాతం న్యాయం చేయడంతోపాటు మళ్లీ మోసపోకుండా కాపాడేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. సైబర్ నేరం ద్వారా మోసపోయిన డబ్బును త్వరగా ఇప్పించే విధంగా నూతన పద్ధతిని సైబర్ వారియర్స్‌కు వివరించామని ఆదిలాబాద్ జిల్లా ఎస్.పి గౌష్ ఆలం తెలిపారు. పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారియర్స్‌కు సూచించారు. ఇదివరకే సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే సైబర్ వారియర్స్ మీకు ఉపయోగకరంగా వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేస్తారని తెలియజేశారు. #cyber-crime #cyber-safety #cyber-fraud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి