Fish : ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. గొంతులో చేప ఇరుక్కుని బాలుడి నరకయాతన!

సరదాగా ఈత కొడదాం అని వెళ్లిన సమర సింహ అనే బాలుడి నోట్లో చేప పిల్ల ఇరుక్కోవడంతో నానా తిప్పలు పడ్డాడు. బాలుడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి చేప పిల్లను బయటకు తీశారు.

New Update
Fish : ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. గొంతులో చేప ఇరుక్కుని బాలుడి నరకయాతన!

Fish Strucked In Mouth : అసలే మండుతున్న ఎండలు(Heat).. పైగా ఆదివారం.. పాఠశాలకు సెలవు(School Holiday) రావడంతో కాసేపు ఈత కొట్టి సేద తీర్చుకుందామని అనుకున్న ఓ గిరిజన యువకుడికి గొంతులో చేప పిల్ల ఇరుక్కుని ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన చత్తీస్గడ్(Chhattisgarh) రాష్ట్రం జాన్జ్ గీర్ చంప జిల్లాలోని అకల్ తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరుమహు గ్రామానికి చెందిన సమీర్‌ సింహ(Sameer Simha) అనే బాలుడు ఆదివారం నాడు ఎండ వేడి తాళలేక సరదాగా ఈత కొడదామని చెరువులోకి వెళ్లాడు.

అక్కడ ఈత(Swimming) కొడుతున్న సమయంలో బాలుడి నోట్లోకి చేప(Fish) పిల్ల దూరింది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. బాలుడు ఒడ్డుకు చేరుకొని ఎలాగోలా ఊర్లోకి వెళ్లాడు. అక్కడ గ్రామస్థులు కూడా చేప పిల్లని బయటకు తీయడానికి నానా ప్రయత్నాలు చేశారు. కానీ వారి వల్ల కాకపోవడంతో
అకల్తారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకువెళ్లారు.

అతని ఉన్న గొంతులో ఉన్న చేపని తియ్యడానికి డాక్టర్లు ప్రయత్నం చేసి కొంతవరకు తీయగలిగారు. గొంతు మధ్యలో ఇరుక్కుని ఉండటంతో ఆ బాలుడు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పరిస్థితి విషమించడంతో బాలుడ్ని హుటాహుటిన అంబులెన్స్ లో బిలాస్పూర్ లోని కేర్ హాస్పిటల్(Care Hospital) కు తరలించారు. ముందస్తు సమాచారం తో సిద్ధంగా ఉన్న వైద్యులు గొంతు ఆపరేషన్ చేసి మిగతా చేపను విజయవంతంగా బయటికి తీశారు.

బాలుడి పరిస్థితి మామూలు స్థితికి రావడం తో పరిశీలనలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆపరేషన్ చేసిన డాక్టర్ రామకృష్ణ తెలిపారు దీనితో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈత సరదా ప్రాణాల మీదకు తెచ్చింది.

Also Read : జనసేన అధినేతకు స్వల్ప అస్వస్థత!

Advertisment
తాజా కథనాలు