Wagh Nakh: వాఘ్‌నఖ్...ఛత్రపతి శివాజీ ఆయుధాలలో ఒకటి. పులి పంజా అని అర్ధం ఉన్న ఇది ఒక రకమైన ఇనుపబాకు లాంటి ఆయుధం. మధ్యకాలంలో ఛత్రపతితో పాటూ ఈ బాకును యోధులందరూ భారతదేశం అంతటా ఉపయోగించారు. వాఘ్ నఖ్ చేతి పంజాలో సులభంగా సరిపోయేలా, అరచేతి కింద దాచడానికి వీలుండేలా రూపొందించారు. ఇది నాలుగు-ఐదు కోణాల ఇనుప బ్లేడ్‌లను కలిగి ఉంటుంది. గ్లోవ్ లాంటి స్ట్రిప్‌కు అతికించబడి ఉంటుంది. వాఘ్ నఖ్ చాలా ప్రమాదకరమైనదని.. అది ఒక్క దెబ్బలో ఎవరినైనా చంపగలదని చరిత్రకారులు చెబుతారు. దీంతోనే ఛత్రపతి శివాజీ అఫ్జల్‌ఖాన్‌ను చంపారని చరిత్రలో ఉంది.
శివాజీ చనిపోయిన తర్వాత మహారాష్ట్రలో ఉన్న దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ ద్వారా వాఘ్ నఖ్ లండన్‌కు చేరుకుంది. అప్పటి నుంచి అది అక్కడే ఉంది. బ్రిటిష్ పాలనలో డఫ్ సతారా జిల్లాలో కంపెనీ ఏజెంట్‌గా ఉండేవాడు. జేమ్స్ గ్రాంట్ డఫ్ వాఘ్ నఖ్‌ను ఎలా స్వాధీనం చేసుకున్నాడు.. అనేది మాత్రం ఎవరికీ కచ్చితంగా తెలియదు. కొన్ని కథల ప్రకారం మరాఠాల చివరి పీష్వా, బాజీరావు-2 మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయినప్పుడు అతను బ్రిటీష్ వారికి లొంగిపోయాడు. అప్పుడు అతనే శివాజీ వాఘ్‌నఖ్‌ను డఫ్‌కు అప్పగించారని అంటారు. ఆ తరువాత డఫ్ దానిని ఇండియా నుంచి స్కాట్లాండ్‌కు తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి అతని కుటుంబం దానిని లండన్ మ్యూజయంకు బహుమతిగా ఇచ్చింది.
Also Read:Weird Traditions: ఆవు రక్తాన్ని తాగే తెగ.. ఈ వింత ఆచారాల గురించి తెలుసా?