విక్రమ్ ల్యాండర్ ఫోటో తీసిన రోవర్.... మరిన్ని ఫోటోలు షేర్ చేసిన ఇస్రో....!

చంద్రయాన్ -3 కు సంబంధించి తాజాగా ఇస్రో మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది. చంద్రుని ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ తీసి పంపింది. ప్రజ్జాన్ రోవర్ పై ఉన్న నావిగేషన్ కెమెరా ద్వారా ఈ ఫోటోలను చిత్రీకరించినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author-image
By G Ramu
విక్రమ్ ల్యాండర్ ఫోటో తీసిన రోవర్.... మరిన్ని ఫోటోలు షేర్ చేసిన ఇస్రో....!
New Update

చంద్రయాన్ -3 కు సంబంధించి తాజాగా ఇస్రో మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది. చంద్రుని ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ తీసి పంపింది. ప్రజ్జాన్ రోవర్ పై ఉన్న నావిగేషన్ కెమెరా ద్వారా ఈ ఫోటోలను చిత్రీకరించినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఈ రోజు ఉదయం విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ చిత్రీకరించింది. రోవర్ పై ఉండే నావిగేషన్ కెమెరాల ద్వారా ఈ ఫోటోలను చిత్రీకరించింది. చంద్రయాన్-3 లోని నావిగేషన్ కెమెరాలను ల్యాబోరేటరి ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్(ఎల్ఈఓఎస్) అభివృద్ది చేసింది’ అని ఇస్రో ట్వీట్ చేసింది. ఇది ఇలా వుంటే చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ చంద్రుని ఉపరితలంపై రూపొందించిన సగం జీవితాన్ని పూర్తి చేశాయి.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ కూడా సౌరశక్తితో పనిచేస్తాయి. ఉష్ణోగ్రతలు (ధ్రువ ప్రాంతంలో) 54° సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యరశ్మి ఉన్న సమయంలో మాత్రమే పనిచేసేలా రూపొందించబడ్డాయి. గత వారం రోజులుగా చంద్రునికి సంబంధించిన శాస్త్రీయమైన డేటాను ల్యాండర్, రోవర్లు పంపుతున్నాయి. వాటి జీవిత కాలం ఒక లూనార్ డే( భూమిపై 14 రోజులు)గా వుంది.

also read: లాంఛ్ రిహార్సల్ పూర్తి… ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్…..!

ఆ 14 రోజుల తర్వాత ల్యాండర్, రోవర్ లోని సోలార్ ప్యానెల్స్ సౌరశక్తిని గ్రహించే శక్తిని కోల్పోతాయి. ఈ క్రమంలో వాటి జీవిత కాలాన్ని మరో లూనార్ డేకు పెంచేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ఇలా వుంటే ఇటీవల ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణించే మార్గంలో ఓ పెద్ద గొయ్యి కనిపించింది. దీంతో రోవర్ ప్రయాణిస్తున్న దిశను ఇస్రో శాస్త్రవేత్తలు మార్పలు చేశారు.

also read: సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్.. ప్రజలకు ఆహ్వానం

రోవర్ ప్రయాణించిన కొత్త మార్గం తాలుకు ఫోటోలను కూడా రోవర్ ఇస్రోకు పంపించింది. మరోవైపు చంద్రునిపై ఉండే ఉష్ణోగ్రతలకు సంబంధించి కీలక డేటాను రోవర్ ఇస్రోకు అందించింది. చంద్రుని ఉపరితలంపై 50.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా, చంద్రునిపై 80 మిల్లీ మీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్టుగా ఇస్రో పేర్కొంది.

#isro #vikram #rover #lander #prgyan #chandrayan3
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి