ISRO: చంద్రుడికి సంబంధించి మరో బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన ఇస్రో.. ఓసారి చూసేయండి.. చంద్రుడికి సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. చంద్రమండలంపై ప్రస్తుతం సేద తీరుతున్న విక్రమ్ ల్యాండర్ తీసిన అద్భుతమైన ఫోటో వచ్చేసింది. ఇస్త్రో ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మంగళవారం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ తీసిన 3 డైమెన్షనల్ 'అనాగ్లిఫ్' ఫోటోను విడుదల చేసింది. By Shiva.K 05 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ISRO Releases 3D Image Of Moon's Surface: చంద్రుడికి సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. చంద్రమండలంపై ప్రస్తుతం సేద తీరుతున్న విక్రమ్ ల్యాండర్(Vikram Lander) తీసిన అద్భుతమైన ఫోటో వచ్చేసింది. ఇస్త్రో ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మంగళవారం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ తీసిన 3 డైమెన్షనల్ 'అనాగ్లిఫ్' ఫోటోను విడుదల చేసింది. ఈ ఫోటో విభిన్న రంగులతో అద్భుతంగా ఆకట్టుకుంటోంది. 'ఇక్కడ అందించిన 'అనాగ్లిఫ్'.. నావ్‌క్యామ్ స్టీరియో ఇమేజెస్‌ని ఉపయోగించి సృష్టించబడింది, ఇందులో ప్రజ్ఞాన్ రోవర్‌లో సంగ్రహించబడిన ఎడమ, కుడి రెండు వైపులా లొకేషన్ కనిపిస్తోంది.' అని స్పేస్ ఏజెన్సీ ఇస్రో పేర్కొంది. 'అనాగ్లిఫ్' అనేది వస్తువు, భూభాగానికి సంబంధించిన సాధారణ స్టీరియో, మల్టీవ్యూ ఇమేజెస్ విజువలైజేషన్. 'ఈ 3-ఛానల్ ఇమేజ్‌లో, ఎడమ చిత్రం ఎరుపు ఛానెల్‌లో, కుడి చిత్రం నీలం, ఆకుపచ్చ ఛానెల్‌లలో ఉండి సియాన్‌ని సృష్టించింది. ఈ రెండు చిత్రాల మధ్య దృక్కోణంలో వ్యత్యాసం స్టీరియో ఎఫెక్ట్‌కు కారణం అవుతుంది. ఇది త్రీ డైమెన్షన్‌ల దృశ్యమాన ముద్రను ఇస్తుంది. ఈ ఫోటోను 3డిలో చూడటానికి ఎరుపు, సియాన్ గ్లాసెస్ ఉత్తమం' అని పేర్కొంది ఇస్రో. ఇకపోతే NavCam ను LEOS/ISRO అభివృద్ధి చేశాయి. డేటా ప్రాసెసింగ్‌ను SAC/ISRO నిర్వహిస్తుంది. ఇది స్పేస్ ఏజెన్సీకి చేరుతుంది. వాస్తవానికి సోమవారం ఉదయం 8 గంటలకు విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్‌లోకి సెట్ చేయడం జరిగిందని ఇస్రో ప్రకటించిన ఒక రోజు తరువాత ఈ ఫోటోలు విడుదల చేసింది. పేలోడ్‌ల ద్వారా సేకరించిన డేటా భూమికి అందిందని, పేలోడ్‌లు ఇప్పుడు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. సెప్టెంబర్ 22న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ మళ్లీ యాక్టీవ్ అవుతాయని ఇస్రో అంచనా వేస్తోంది. ఆగష్టు 23న, చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో భారతదేశం రాకెస్ సైన్స్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. చారిత్రాత్మక ఫీట్‌ను సాధించిన మొదటి దేశంగా నిలిచింది. చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్‌పై నిరాశ నుంచి బయటకు వచ్చి.. చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగింది. చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండర్‌ను దింపిన అమెరికా, చైనా, రష్యాల తరువాత భారత్ నాలుగో దేశంగా నిలిచింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 Also Read: India to Bharat: ‘ఇండియా’ పేరును భారత్‌గా మార్చడం సులభమేనా? ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు.. Union Minister Kishan Reddy: రైతులను నిండా ముంచిన కేసీఆర్.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. #chandrayaan-3 #isro #vikram-lander #pragyan-rover #isro-pics #moon-pics #3d-image-of-moon #moon-surface మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి