ISRO: చంద్రుడికి సంబంధించి మరో బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన ఇస్రో.. ఓసారి చూసేయండి..
చంద్రుడికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. చంద్రమండలంపై ప్రస్తుతం సేద తీరుతున్న విక్రమ్ ల్యాండర్ తీసిన అద్భుతమైన ఫోటో వచ్చేసింది. ఇస్త్రో ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మంగళవారం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ తీసిన 3 డైమెన్షనల్ 'అనాగ్లిఫ్' ఫోటోను విడుదల చేసింది.