Chandrababu:చంద్రబాబును కలిసి కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నారు. 14 గంటలు ప్రయాణం చేసి ఈరోజు ఉదయం 6గంటలకు ఉండవల్లిలో ఆయన నివాసానికి వచ్చారు. చంద్రబాబును ఇంటిలో కలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. By Manogna alamuru 01 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి నిన్న జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు సాయంత్రం 4.15 గంటలకు రాజమండ్రి నుంచి బయలు దేరారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలో తన నివాసానికి వచ్చారు. రాజమండ్రికి చేరుకున్న భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో కలిసి రోడ్డు మార్గంలో 14 గంటలు ప్రయాణం చేసి ఈ రోజు ఉదయం ఆరు గంటలకు నివాసానికి చేరుకున్నారు బాబు. Also read:ఉద్వేగం..ఉద్విగ్నం.. ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. ! వీడియో! దారి పొడవునా చంద్రబాబు నాయుడును చూడ్డానికి ప్రజలు వస్తూనే ఉన్నారు. అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం పెద్ద సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇంటికి వచ్చిన వెంటనే చంద్రబాబు మొట్టమొదటగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఆ తర్వాత పూజారులు, పండితులు బాబు దంపతులను ఆశీర్వదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాకకు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. రెండు నెలలు జైల్లో గడిపి వచ్చిన బాబును చూసి బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది కన్నీరు పెట్టుకుని మరీ తమ అభిమాన్నాన్ని, ప్రేమను చూపించారు. చంద్రబాబు ప్రతీ ఒక్కరినీ దగ్గర తీసుకుని మరీ పలకరించారు. అయితే సుదీర్ఘ ప్రయాణం వలన బాబు బాగా అలిసి పోయారని చెబుతున్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఈరోజు కొంతసేపు కుటుంబసభ్యులు, బంధువులతో గడిపిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళనున్నారు. అక్కడ ఆయన ఎప్పుడూ వెళ్ళే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. #family #home #chandrabu #reletives మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి