Botsa Satyanarayana Warning To CM Chandrababu | AP Assembly Sessions LIVE | Pawan Kalyan | RTV
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నారు. 14 గంటలు ప్రయాణం చేసి ఈరోజు ఉదయం 6గంటలకు ఉండవల్లిలో ఆయన నివాసానికి వచ్చారు. చంద్రబాబును ఇంటిలో కలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.