ఖబడ్దార్ పెద్దిరెడ్డి.. మళ్లీ పుంగనూరు వస్తా.. చంద్రబాబు సవాల్ పుంగనూరు ఒక్కసారిగా రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. వైసీపీ నేతల దాడిలో పలువురు టీడీపీ నేతలు, పోలీస్ అధికారులు గాయపడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న పుంగనూరును చంద్రబాబు హింసాకాండగా మార్చారన్నారు. By Karthik 04 Aug 2023 in తిరుపతి New Update షేర్ చేయండి పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. పుంగనూరు ఘటనపై విచారణ జరించాలని ఆయన డిమాండ్ చేశారు. పుంగనూరు ఘటనకు పోలీసులే కారణమని విమర్శించారు. నేను పుంగనూరు రోడ్లపై తిరగకూడదా.? అని ప్రశ్నించారు. పుంగనూరు మళ్లీ వస్తా.. గర్జిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిని అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు. దీంతో పుంగనూరులో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పుంగనూరుకు టీడీపీ శ్రేణులు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. Your browser does not support the video tag. మరోవైపు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఎవరూ యుద్ధానికి వెళ్లలేదని, చంద్రబాబు నాయుడే శాంతియుతంగా ఉన్న పుంగనూరును రణరంగంగా మర్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పర్యటనకు వచ్చిన వ్యక్తి తన పని తాను చేసుకుపోకుండా.. వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారన్నారు. చంద్రబాబు వైసీపీ నేతలను రెచ్చగొడుతూ.. తన రౌడీ మూకలను వైసీపీ నాయకులపైకి తోలాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యాకర్తలపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరించాలన్న పెద్దిరెడ్డి.. చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలన్నారు. బాబు నిన్న రాత్రే పుంగనూరులోకి వచ్చారన్నారు. నిన్న రాత్రి ఇక్కడకు వచ్చిన చంద్రబాబు దాడికి స్కెచ్ వేశారన్నారు. తన ప్లాన్లో భాగంగానే పుంగనూరులో ఈ దాడి చోటు చేసుకుందని విమర్శించారు. శాంతి యుతంగా ఉన్న పుంగనూరును చంద్రబాబు రణరంగంగా మార్చారని పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా రాష్ట్రంలో హింసకాండగా మార్చాలని చంద్రబాబు చూస్తున్నారన్న ఆయన.. అనంతరం దీనిని ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పుంగనూరులో దౌర్జన్యానికి పాల్పడింది ఎవరో విడీయోలతో సహా ఉన్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. #punganur #chandrababu #tdp #ycp #peddireddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి