AP Cabinet: లోకేష్ తో పాటు మొత్తం పది మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు.. లిస్ట్ ఇదే! తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో చోటిచ్చారు. ఈసారి సీబీఎన్ మంత్రివర్గం ఎంపికలో తనదైన స్టైల్ చూపించారు. నారా లోకేష్ , పవన్ తో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన వారిని బాబు తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. By Bhavana 12 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచి రికార్డులు సృష్టించింది. ఈసారి ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. జూన్ 12 ఉదయం 11 .27 గంటలకు రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం సిద్దమైంది. ఈసారి చంద్రబాబు క్యాబినెట్లో మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను ప్రకటించారు. అంచనాలకు భిన్నంగా మంత్రులు ఎంపికలో చంద్రబాబు తనదైన స్టైల్ చూపించారు.చంద్రబాబు తన కొత్త మంత్రివర్గంలో జనసేనకు మూడు, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో చోటిచ్చారు. ఈసారి సీబీఎన్ మంత్రివర్గం ఎంపికలో తనదైన స్టైల్ చూపించారు. నారా లోకేష్ , పవన్ తో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన వారిని బాబు తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. వారిలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి లు తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలే. అంతేకాకుండా పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి లు గతంలో మంత్రులుగా చేసిన వారే. ఈ సారి మంత్రి వర్గంలోకి ముగ్గురు మహిళలను అధినేత ఎంపిక చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం దక్కింది.బీజేపీ నుంచి సత్య కుమార్ మాత్రమే మంత్రి కానున్నారు. వీరితో పాటు ప్రకాశం జిల్లా నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవిత, తూర్పుగోదావరి నుంచి వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మందపల్లి రాంప్రసాద్రెడ్డిలను చంద్రబాబు ఎంపిక చేశారు. కొందరు సీనియర్లతో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. అనూహ్యంగా విశాఖ జిల్లా నుంచి కేవలం ఎస్సీ మహిళ వంగలపూడి అనితకు మాత్రమే క్యాబినెట్లో అవకాశం దొరికింది. అక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మంత్రివర్గంలో చోటు వస్తుందని ఆశించారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోనూ చంద్రబాబు ఎంపిక చర్చనీయాంశం గా మారింది. ఈసారి మంత్రి వర్గంలో బీసీలకు ప్రాధాన్యత పెరిగింది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే సత్య కుమార్ పేరు ఎంపిక చేశారు. కడప జిల్లా నుంచి రాయచోటి ఎమ్మెల్యే మందపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేబినెట్లో అవకాశం కల్పించారు. Also read: కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు! #bjp #tdp #pawan-kalyan #janasena #new-ministers #cbn మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి