/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-2-jpg.webp)
Chandrababu Bail Petition: స్కిల్ డవలప్మెంట్ కేసులో (AP Skill Development Case) చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో (AP High Court) విచారణ జరగనుంది. స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు (Chandrababu) దాదాపు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్ పై సీఐడీ (AP CID) 900 పేజీలతో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, సీఐడీ అడ్వకేట్ల వాదనలు విననుంది హైకోర్టు. అనంతరం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనుంది.
ఇది కూడా చదవండి: Margadarshi CID Case: మార్గదర్శి క్వాష్ పిటిషన్ 8 వారాలకు వాయిదా
ఇదిలా ఉంటే.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ రోజు తో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. ఈ రోజు వర్చువల్ గా చంద్రబాబు తో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడనున్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటారు.
ఇది కూడా చదవండి: Sajjala Comments: చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల సంచలన వాఖ్యలు.. ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అంటూ ధ్వజం
కోర్టు ఆదేశాలు జైలు అధికారులు అమలు చేస్తున్నారా? లేదా? అన్న అంశంపై చంద్రబాబుతో మాట్లాడనున్నారు. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తారా? చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (Inner Ring Road Case) టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నిన్న వాదనలు జరిగాయి. ఈ కేసు విసయంలో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్చడం ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ కు లబ్ధి చేకూర్చారని కౌంటర్ లో పేర్కొంది సీఐడీ. మరోవైపు.. లేని ఇన్నర్ రింగ్ రోడ్ పై కేసు నమోదు చేసిందని చంద్రబాబు తరపు అడ్వకేట్లు వాదించారు. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.