Chandrababu : ఆ తప్పు మనం చేయొద్దు.. జగన్ పాలనపై చంద్రబాబు సంచలన కామెంట్స్! AP: జగన్ పరిపాలనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష తీర్చుకోవాలని అనుకుంటే మనకు కూడా సమస్య వస్తుందని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తనను, తన కుటుంబాన్ని అవమానించారని అన్నారు. By V.J Reddy 11 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Chandrababu Comments About Jagan : జగన్ పరిపాలన (Jagan Sarkar) పై చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష తీర్చుకోవాలని అనుకుంటే మనకు కూడా సమస్య వస్తుందని అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెడితే మళ్లీ అదే చేస్తారని పేర్కొన్నారు. కానీ తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్షపడాలని అన్నారు. నాకు, నా కుటుంబానికి అవమానం జరిగిందని అన్నారు. ఆ రోజే తాను శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. "నా శపథాన్ని ప్రజలు గౌరవించారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారో తెలియదు. అన్ని అంశాలపై అధ్యయనంపై చేయాల్సిన అవసరం ఉంది. పోలవరాన్ని (Polavaram) డయా ఫ్రం వాల్ ఎక్కడ ఉందే తెలియని పరిస్థితి. పోలవరాన్ని పూర్తి చేయాలి. నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత మనపై ఉంది" అని అన్నారు. Also Read : 12 రోజుల్లో రూ.1225 కోట్లు పెరిగిన చంద్రబాబు ఆస్తి విలువ! #ap-tdp #jagan #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి