Chandrababu : తిరుపతి జిల్లాలో పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా? అంటూ సీఎం జగన్ సందేహపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సెటైర్లు వేశారు. మిచౌంగ్ తుఫానుతో పంటలను నష్టపోయిన రైతులు ఓ వైపు కన్నీళ్లు పెడుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. సీఎం జగన్‌కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ.. చేతలు గడపకూడా దాటవని ఎద్దేవా చేశారు.
బాపట్ల జిల్లా(Bapatla) వేమూరు నియోజకవర్గం అమృతలూరులో మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన పంటపొలాలను పరిశీలించిన చంద్రబాబు రైతులతో మాట్లాడారు. వైసీపీ చేతకాని పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా సీఎం కామెంట్స్ ను టీడీపీ టార్గెట్ చేసింది. పొటాటో సీఎం అంటూ ట్రోల్స్ చేస్తోంది. ఆలుగడ్డకి, ఉల్లిగడ్డకి తేడా తెలియని సీఎం రైతుల కష్టాలు తీరుస్తారా అంటూ? విమర్శలు చేస్తున్నారు. బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదని.. వ్యక్తి మన ముఖ్యమంత్రి అవ్వటం మన దౌర్భాగ్యం అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఆస్పత్రిలో కేసీఆర్ ఎలా నడుస్తున్నారో చూడండి.. వీడియో మీకోసం..