Chandrababu:ఇసుక కుంభకోణం కేసు పిటిషన్ మీద హైకోర్టులో విచారణ ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరింగింది.దీని మీద ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది. By Manogna alamuru 08 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక కుంభకోణంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇసుక కుంభకోణం కేసులో A-2గా చంద్రబాబు ఉన్నారు. దీని మీద కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈనెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. Also Read:పెళ్ళి వీడియో అమ్ముకోలేదు..క్లారిటీ ఇచ్చిన వరుణ్ టీమ్ రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, కోర్టులు చుట్టూ తిరగాలన్న ఉద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై నేను, ఇతర ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నామని...మా నోళ్లు మూయించాలనే కేసు పెట్టారు. మేం ప్రభుత్వ అక్రమాలపై ఏం అంశాల మీద అయితే గొంతెత్తుతున్నామో వాటితోనే మాకు ముడిపెట్టి తప్పుడు కేసులు నమోదు చేశారని బాబు ఆరోపించారు. ఇది కచ్చితంగా ప్రతీకార చర్యే అని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్ లో ఉంది. ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ కేసును జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించనుంది. Also read:మనకు తిరుగులేదు బాస్..ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకుల్లో భారత ఆటగాళ్ళు #chandrababu #ap-high-court #petition #hearing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి