Chandrababu Quash Petition: ఎల్లుండే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. రిలీఫ్ దొరికేనా?

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్ పై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.

Chandrababu case: చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?
New Update

Chandrababu Quash Petition: స్కిల్ డవలప్మెంట్ కేసుకు (AP Skill Development Case) సంబంధించి సుప్రీంకోర్టులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు (AP Ex CM Chandrababu Naidu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్ పై ఈ నెల 3న విచారణ జరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. సుప్రీంకోర్టులో సోమవారానికి ఈ కేసు లిస్ట్ అయింది. 59వ నంబర్ గా ఈ పిటిషన్ లిస్ట్ అయింది. అయితే.. సోమవారం అయినా కోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా? లేదా? అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: కాంతితో క్రాంతి అంటున్న లోకేష్‌..చంద్రబాబుకి మద్దుతుగా ఈ పని చేయండి!

ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ (CID) దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ మీద ఏసీబీ కోర్టులో (ACB Court) వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరుఫున ప్రమోద్ కుమార్ దూబే (Pramod Kumar Dubey) సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వారి వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో సోమవారం కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనే అంశంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకే రోజు క్వాష్ పిటిషన్, బెయిల్, కస్టడీ పిటిషన్లపై సుప్రీం, హైకోర్టులో ఉండడంతో ఏం జరుగుతుందోన్న టెన్షన్ టీడీపీ (TDP) వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 10వ తేదీన నారా లోకేష్ (Nara Lokesh) ఏపీ సీఐడీ ఎదుట ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అదే రోజు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

#chandrababu-arrest #ap-skill-development-case #chandrababu-case #chandrababu-quash-petition #supreme-court
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe