పోలవరం ఎప్పుడూ పూర్తవుతుందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: చంద్రబాబు!

ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు.

పోలవరం ఎప్పుడూ పూర్తవుతుందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: చంద్రబాబు!
New Update

ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు.

టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు కోసం రూ.2,289 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ కూడా చింతలపూడి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలంటూ నిలదీశారు.

పోలవరంలో 2004 నుంచి 2014 వరకు జరిగింది ఐదు శాతం పనులేనని స్పష్టం చేశారు. అసలు , పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థాయికి ఈ ప్రభుత్వం చేరుకుందని వివరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిపై చంద్రబాబు పట్టిసీమ, పోలవరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు. 2004 నుంచి పాలకుల వైఖరి కారణంగా ప్రాజెక్టు రెండుసార్లు బలైందని విచారం వ్యక్తం చేశారు. 2004లో మధుకాన్, శీనయ్య సంస్థలకు టెండర్లు దక్కాయని, కానీ కక్ష సాధింపు చర్యలతో అప్పటి పనులు రద్దు చేశారని చంద్రబాబు వెల్లడించారు.

కమీషన్ల కోసం కాలువ పనులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక తేదీలు ప్రకటిస్తూ వచ్చారని, కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పోలవరం పనులు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడైతే... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.

దేశంలో పట్టిసీమ లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టు‌ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. సోమవారం పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల పట్టిసీమకు ఎంతో నష్టం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అయిదు ప్రధాన నదులు, 69 ఉపనదులు ఉన్నాయని.. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ లేని నీళ్లు ఏపీలో ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగిస్తే రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ఇతర నదులతో అనుసంధానించాలని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని వివరణ కోరారు.

#chandrababu-naidu #ycp #tdp #jagan #andhrapradesh #projects
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe