TDP-JSP: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు - పవన్ కసరత్తు

టీడీపీ - జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే మరోసారి చంద్రబాబు - పవన్ భేటీ అవుతారని సమాచారం.

TDP-JSP: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు - పవన్ కసరత్తు
New Update

TDP-Janasena : ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ - జనసేన పొత్తు (TDP-Janasena Alliance) పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీల అధినేతలు ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు వ్యూహాలు రచిస్తోన్నారు. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెెండుసార్లు చంద్రబాబు (Chandrababu) - పవన్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. త్వరలోనే మరోసారి వీరిద్దరూ భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల అధినేతలు హైదరాబాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.!

వచ్చే రెండు రోజులు సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఖరారు మీదే ఫోకస్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. సీట్ల సర్దుబాటు కసరత్తు నిమిత్తమే రా..కదలి రా..! సభలకు టీడీపీ అధినేత విరామం ఇచ్చారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే 17 పార్లమెంట్ సెగ్మెెంట్లల్లో ఈ సభలు పూర్తి అయ్యాయని.. వచ్చే నెల 4వ తేదీ నుండి మళ్లీ మిగిలిన ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తారని ప్రచారం జరగుతోంది.

Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు అతి భారీ షాక్‌.. పదేళ్లు జైలుశిక్ష!

మరోవైపు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీట్ల సర్దుబాటు ప్రకటన జరిగాకే తన పర్యటనలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి పవన్ పర్యటనలు ప్రారంభిస్తారని ఇప్పటికే జనసేన సంకేతాలు ఇచ్చింది. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైనా చంద్రబాబు - పవన్ తుది కసరత్తు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

#chandrababu #andhra-pradesh #janasena #pawan-kalyan #jana-sena-chief-pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe