స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదికను వెల్లడించారు.
అయితే వారు చెప్పిన రిపోర్టు లోని వివరాలు టీడీపీ శ్రేణులను,కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మెడికల్ రిపోర్ట్ ను బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు.
Also read: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!
అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక. చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డిహైడ్రేషన్ తో బాబు ఇబ్బంది పడుతున్నారు అని తేల్చిన ప్రభుత్వ వైద్యులు.
డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలని నివేదిక లో స్పష్టంగా సూచన. చంద్రబాబు కి హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి (Hyper trophic cardiomyopathy) సమస్య ఉందంటున్న వ్యక్తి గత వైద్యులు. ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్ తో గుండె పైన ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తి గత వైద్యుల ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి చూపిస్తున్న ప్రభుత్వం, అధికారులు. తాజాగా వైద్యులు వెల్లడించిన నివేదిక తో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.