టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన పేరుతో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. 1947 నుంచి 2019 వరకు ఏపీలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలే అధికారంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 1978లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పాటు మంత్రిగా పనిచేశారన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తన భార్యతో పాటు ఎన్టీఆర్ వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడి తెలుగుదేశం పార్టీలో చేరాడని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1978 నుండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉండేవారని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు విన్యాసాలు
చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 1978 కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. అనంతరం ఆయన భార్యతో కలిసి ఎన్టీఆర్ను కలిశారని, ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని తనను తెలుగు దేశం పార్టీలోకి తీసుకోవాలని కోరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరకు టీడీపీ వ్యవస్థాపకుడికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
Translate this News: