Skill Scam Case: స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు.. విచారణ రేపటికి (గురువారం) కి వాయిదా వేసింది. సీఐడీ తరఫున వాదనలు వినిపించారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్యం పరిస్థితిపై ఆయన తరఫున లాయర్లు కోర్టుకు విన్నపించుకున్నారు. ఇద్దరి న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!
ఈ రోజు స్కిల్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణలో హైకోర్టుకు చంద్రబాబు ఆరోగ్యంపై పలు కీలక విషయాలను వెల్లడించారు ఆయన తరఫున లాయర్లు. ఇటీవల కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేశారు వైద్యులు. కంటి ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. తాజాగా గుండె సంబంధించిన సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారని ఆయన తరఫున లాయర్లు కోర్టుకు తెలిపారు. చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని.. తద్వారా గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి లాయర్లు తీసుకెళ్లారు. చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలంటే మరికొన్ని రోజులు విశ్రాంతి కావాలని.. అందువలన మధ్యంతర బెయిల్ ను మరికొన్ని రోజులకు పెంచాలని చంద్రబాబు తరఫున లాయర్లు కోర్టుకు విన్నపించుకున్నారు. దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది రేపటి వరకు వేచి చూడాలి.
ALSO READ: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!