ChandraBabu: బీసీ సోదరుల జోలికి ఎవరూ వచ్చే ధైర్యం చేయకూడదు: చంద్రబాబు!

రాష్ట్రంలో సామాజికంగా , ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకుని వచ్చే బాధ్యత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం కూడా ఎవ్వరూ చేయకూడదనే టీడీపీ మేనిఫెస్టోలో కూడా బీసీ రక్షణ చట్టం చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు.

ChandraBabu: బీసీ సోదరుల జోలికి ఎవరూ వచ్చే ధైర్యం చేయకూడదు: చంద్రబాబు!
New Update

AP Politics: ఏపీ రాజకీయాలు (Ap Politics) రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అధికార పక్ష నేతల్లో చాలా మంది నేతలు అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీలుగా చేసిన వారు ఈ సారి సీట్లు రాకపోయేసరికి..తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు బహిరంగంగానే వైసీపీ (YCP) అధినేత పై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో చాలా మంది నేతలు జనసేన (Janasena) , టీడీపీ (TDP) జెండాలు కప్పుకుంటున్నారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో '' జయహో బీసీ'' వర్క్‌ షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గెలిచిన తరువాత బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అందరికీ కూడా పదవులు ఇస్తామంటూ పేర్కొన్నారు.

రాష్ట్రంలో సామాజికంగా , ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకుని వచ్చే బాధ్యత టీడీపీదేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం కూడా ఎవ్వరూ చేయకూడదనే టీడీపీ మ్యానిఫెస్టోలో కూడా బీసీ రక్షణ చట్టం చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు.

గత ఎన్నికల సమయంలో బీసీ ఉప ప్రణాళిక కింద రూ. 75 వేల కోట్లు ఇస్తానన్న జగన్‌ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క రూపాయి అయినా వారి కోసం ఖర్చు చేశాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. బీసీల కోసం టీడీపీ అమలు చేసిన 30 సంక్షేమ పథకాలను జగన్‌ రెడ్డి రద్దు చేసి , వారి ఆర్థిక స్థితి గతుల పై దెబ్బ కొట్టాడని ఆయన ఆరోపించారు.

భవనాలు పూర్తి చేయలేదు కానీ..మూడు రాజధానులు కడతాడా..?

టీడీపీ ప్రభుత్వం నిర్మించిన బీసీ భవనాలనే కనీసం పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి భవనం కూడా నిర్మించలేదు కానీ..మూడు రాజధానులు నిర్మిస్తాడంట..అంటూ పేర్కొన్నారు. ఆ కథ కూడా సుప్రీం కోర్టులో ముగిసిపోయింది అని వివరించారు.

అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల కోసం ఒక్క హామీ కూడా అమలు చేయని ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని బీసీ సామాజిక యాత్రకు తయారైందని బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాగుపడింది ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం జగన్ కంపెనీలు మాత్రమే అంటూ వివరించారు.

బీసీ నాయకత్వాన్ని తయారు చేసిన యూనివర్సిటీ టీడీపీ..

బీసీలను అడుగడుగునా వేధించిన, వేధిస్తున్న ఏకైక పార్టీ, ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీనే అని పేర్కొన్నారు. బీసీ నాయకత్వాన్ని తయారు చేసిన యూనివర్సిటీ టీడీపీ అని పేర్కొన్నారు. ప్రజలకు రూ.10 ఇచ్చి..రూ. 100 దోచుకోవడం జగన్‌ నైజమని ..టీడీపీ మాత్రం రూ. 15 ఇచ్చి రూ.100 సంపాదించుకునే మార్గం చూపిస్తామని వివరించారు.

జగన్ చేసిన సామాజిక న్యాయంలో బాగుపడింది ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం విజయసాయి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మినహా మిగతా ఏ రెడ్డి కూడా బాగుపడలేదు అని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత అందరిపైనా ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.

Also read: బీచ్‌ ఒడ్డున మార్నింగ్‌ వాక్‌..సముద్రంలో స్నార్కెలింగ్‌..ప్రకృతిని ఆస్వాదిస్తున్న మోదీ!

#chandrababu-naidu #ycp #tdp #jagan #janasena #pawan-kalan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe