Pawan Kalyan Gets Another Important Responsibility : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) మరో కీలక బాధ్యతను అప్పగించారు. సోమవారం నాడు జరిగిన కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా రానున్న వందరోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా ఫిషరీస్, ఉద్యానవన, అటవీశాఖల అధికారులు సీఎంకు తెలియజేశారు.
అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో .. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.
ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Also read: హసీనా భారత్‌లో సేఫ్గా ఉంది…మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా!