Chandrababu:ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా

ఇన్నర్ రింగ్ రోడ్ కేస్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

TDP : టీడీపీకి భారీ షాక్.. 400 మంది రాజీనామా..!
New Update

ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు..ఇన్నర్ రింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ రోజు దాని మీద ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ మీద ఇంతకు ముందు విచారణ జరిగింది. అప్పుడు చంద్రబాబుకు ఇవాల్టి వరకు అంటే నవంబర్ 7వరకు అరెస్ట్ చేయ్యదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. విచారణ దశలో ఉన్న పిటి వారెంట్ పై ఇవాళ్టి వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు బాబు సహకరిస్తారని గత విచారణలో చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వుల సమయం నేటితో ముగిసింది. దీని మీద ఇవాళ వాదనలు జరిగాయి. ఈ కేసును కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.

Also Read:వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ డిప్యుటీ సీఈఓగా పని చేసిన యూపి క్యాడర్ ఐఎఎస్ అధికారి అపర్ణ భర్త భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. సీమెన్స్ సంస్థ డైరెక్టర్‌గా ఉండి ప్రాజెక్టు వ్యయం పెంచారని గతంలోనే భాస్కర్ పై కేసు పెట్టారు. ప్రైవేటు సంస్థ ఉద్యోగి అయిన భాస్కర్ కు ఎసిబి చట్టం వర్తించదని అప్పుడు కోర్టు రిమాండ్‌ను తిరస్కరించింది. ఎసిబి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్ళింది. సిఐడికి వాదనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. భాస్కర్ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను కూడా ఎపి హైకోర్టు తిరస్కరించింది. దీంతో భాస్కర్ సుప్రీంకు వెళ్ళారు. అక్కడ జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం భాస్కర్ కు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులు అందరూ ఇప్పటికే బెయిల్ పై ఉన్నారని...విచారణకు సహకరించిన కారణంగా బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇక ఈరోజు టీడీపీ యువ అధినేత లోకేష్ ఏపీ గవర్నర్ నజీర్‌ ను కలవనున్నారు. చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు నమోదు చేయడంపై లోకేష్ గవర్నర్‌కు వివరించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై లోకేష్ వివరించనున్నారు. నిన్న లోకేష్ హైదరాబాద్ నుండి విజయవాడకు చేరుకున్నారు. వైసీపీ అధికారంలోకి వొచ్చిన నాటి నుండి ప్రతి పక్ష నేతలపై పెట్టిన కేసులను కూడా గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు లోకేష్. ఇప్పటికే గవర్నర్ ని టీడీపీ నేతలు  రెండు సార్లు కలిశారు. ఈరోజు లోకేష్ తో పాటు గవర్నర్ ని కలవనున్న అచ్చం నాయుడు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, దూళిపాళ్ల నరేంద్ర ఇతర నేతలు కూడా గవర్నర్ దగ్గరకు వెళ్ళనున్నారు.

Also Read:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

#ap-high-court #hearing #chandrababu #irr-case #lokesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి