AP Politics : సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఎన్నికల్లో వినియోగించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 09 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Politics : ఏపీలో ఎన్నికల(AP Elections 2024) ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి రాజకీయ పార్టీలతో భేటీలు, ఫిర్యాదుల స్వీకరణ, వాటిపై రాష్ట్ర స్ధాయిలో అధికారులకు సూచనలు చేయడం వంటి కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకుంది సీఈసీ(CEC) బృందం. ఈ నేపథ్యంలో ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Janasena Pawan Kalyan) సీఈసీని కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి వివరించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశాం సాక్ష్యాలతో సహా రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగోట్లు చేర్చారని అన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఎన్నికల్లో వినియోగించకుండా చూడాలని సీఈసీని కోరినట్లు తెలిపారు. కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని..బైండోవర్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చెప్పినట్లు తెలిపారు. జన్మభూమిలో ఓటేసే హక్కు ఉండదా? తెలంగాణలో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని..అయితే ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని వివరించామన్నారు. ఎన్నికల ప్రక్రియను ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని తెలిపామన్నారు. ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని వైసీపీ ప్రభుత్వం చేయడమేంటి? ఇతర ప్రాంతాలకు వెళ్లినవాళ్లకు జన్మభూమిలో ఓటేసే హక్కు ఉండదా? అంటూ ప్రశ్నించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఎన్నికలకు వాడుకోవాలని చూస్తున్నారని వెల్లడించామన్నారు. ఎన్నికల సంఘం మా అభర్థనను ఓపికగా వినిందని..సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్లను పంపాలి అని కోరామన్నారు. Also Read: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో లా అండ్ ఆర్డర్ లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చంద్రగిరిలో లక్షకిపైగా దొంగ ఓట్లు ఉన్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని వైసీపీ చేసిన పనులను ఎన్నికల సంఘానికి వివరించామని తెలిపారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వాలంటీర్ వ్యస్థ రాజ్యాంగ వ్యతిరేకమని, ఎన్నికల్లో వారిని వినియోగించవద్దని తెలిపామన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో హింస ఎక్కువ అయిందని.. కచ్చితంగా ప్రభుత్వం మారుతుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. #janasena #ap-ex-cm-chandrababu #cec #chandrababu-and-pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి