Chandini Chowdary : నేను, బాలయ్య సెట్ లో ఆ పని చేసేవాళ్ళం.. 'NBK109' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న చాందిని చౌదరి!

హీరోయిన్ చాందిని చౌదరి 'NBK109' మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'NBK109' సినిమా గురించి, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాలో తనది ఫుల్ లెంగ్త్ రోల్ అని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారని తెలిపింది.

New Update
Chandini Chowdary : నేను, బాలయ్య సెట్ లో ఆ పని చేసేవాళ్ళం.. 'NBK109' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న చాందిని చౌదరి!

Actress Chandini Chowdary About Balakrishna :తెలుగమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary) రీసెంట్ గా విశ్వక్ సేన్ 'గామి' సినిమాలో నటించింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతుంది. ఇక త్వరలోనే ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటిస్తున్న 'NBK109' లో కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ టైంలో బాలయ్యతో దిగిన స్పెషల్ ఫోటో కూడా షేర్ చేసి బాలకృష్ణకు విషెష్ తెలిపింది.

ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నా...

చాందిని చౌదరి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'NBK109' సినిమా గురించి, బాలకృష్ణ (Balakrishna) గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మాట్లాడుతూ.. సినిమా ఆల్మోస్ట్ 50 శాతం షూటింగ్ అయిపోయింది. ఇందులో నేను ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఉంటుంది నా పాత్ర.

Also Read : చాలామంది ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ‘ఎన్టీఆర్’ హీరోయిన్!

సెట్ లో ప్రాంక్స్ చేసేవాళ్ళం...

ఒక స్టార్ హీరో సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. కథలో నాది చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర. సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారు. సెట్ లో మేమేమిద్దరం కలిసి అందరి మీద ప్రాంక్స్ చేసేవాళ్ళం సరదాగా. షాట్ ఉన్నా లేకపోయినా బాలయ్య గారు సెట్ లోనే ఉంటారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరితో ఈజీగా కలిసిపోతారు" అని చెప్పుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు